Electrifying Breezy Number Chinni Chinni Unveiled From Itlu Arjuna

Electrifying Breezy Number Chinni Chinni Unveiled From Itlu Arjuna
Star director Venky Kudumula is stepping into production with Itlu Arjuna under What Next Entertainments, introducing Aniesh as the film’s lead hero. Directed by debutant Mahesh Uppala and starring Anaswara Rajan as the female lead, the film has already generated enough curiosity through its title glimpse, first single, promotional material, and the intriguing Finding Arjuna promo. Now, the makers have come up with the second single, Chinni Chinni- A Love Banger.
Composed, programmed, and arranged by S Thaman, Chinni Chinni is a breezy and melodious romantic song with an upbeat contemporary feel. It blends acoustic sounds with energetic electronic beats. The electric mandolin adds a catchy folk-pop touch, while rhythm guitars and soft synths give the song a rich and vibrant sound.
Sung with soulful, breezy charm by Mohit Chauhan, the song benefits immensely from his signature textured voice, which infuses warmth and nostalgic longing into the track. Written by Kalyan Chakravarthy, the lyrics revolve around blossoming love, sweet everyday moments, and the overwhelming feeling of a small world turning into an infinite universe when you fall for someone. The catchy hook line, Chinni Chinni Naa Paatey, captures the playful and heartwarming rhythm of falling in love.
From riding together on a scooter through lush greenery and city streets to sharing quiet rooftop moments, stealing glances on a crowded metro, and watching their story unfold in a movie theatre, Aniesh and Anaswara’s interplay feels fresh, youthful, and deeply endearing. The duo indeed shares effortless and sparkling chemistry.
The song receives an instantaneously blockbuster response and is poised to become a chartbuster romantic number.
అనీష్, అనస్వర రాజన్, మోహిత్ చౌహాన్, ఎస్. థమన్ ‘ఇట్లు అర్జున’ నుంచి లవ్ బ్యాంగర్ చిన్ని చిన్ని సాంగ్ రిలీజ్
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ఆసక్తి పెంచుకున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండో సింగిల్ ‘చిన్ని చిన్ని’ను మేకర్స్ విడుదల చేశారు.
ఎస్. థమన్ కంపోజ్ చేసి, ప్రోగ్రామ్ చేసి, అరేంజ్ చేసిన ఈ పాట ఫ్రెష్, మెలోడీయస్ రొమాంటిక్ నంబర్‌గా ఆకట్టుకుంటోంది. అకౌస్టిక్ సౌండ్స్‌కు ఎనర్జిటిక్ ఎలక్ట్రానిక్ బీట్స్‌ను జోడించిన థమన్.. ఎలక్ట్రిక్ మాండలిన్, రిథమ్ గిటార్స్, సాఫ్ట్ సింథ్స్‌తో పాటకు మంచి రిచ్ సౌండ్ తీసుకొచ్చారు.
మోహిత్ చౌహాన్ తన సిగ్నేచర్ వాయిస్‌తో పాటకు నాస్టాల్జిక్ ఫీల్ తీసుకొచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ ప్రేమలో పడినప్పుడు కలిగే ఆ చిన్న చిన్న ఆనందాలు, రోజువారీ క్షణాల్లో పుట్టే ప్రేమను అందంగా చెబుతున్నాయి. ‘చిన్ని చిన్ని నా పాటే’ అనే హుక్ లైన్ పాటకు మరింత క్యాచీ ఫీల్ ఇచ్చింది.
స్కూటర్‌పై పచ్చని లొకేషన్లలో, సిటీ స్ట్రీట్స్‌లో కలిసి తిరగడం నుంచి.. రూఫ్‌టాప్‌పై ప్రశాంతంగా గడిపే క్షణాలు, రద్దీగా ఉన్న మెట్రోలో ఒకరికొకరు దొంగచూపులు చూసుకోవడం, చివరికి థియేటర్లో తమ ప్రేమకథను చూసుకోవడం వరకు.. అనీష్, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా, నేచురల్‌గా అనిపిస్తోంది.
యూత్‌ఫుల్ విజువల్స్, మోహిత్ చౌహాన్ వాయిస్, థమన్ మెలోడీ, హీరోహీరోయిన్ల మధ్య ఉన్న స్పార్కింగ్ కెమిస్ట్రీ కలిసి ‘చిన్ని చిన్ని’ పాటను వెంటనే ఆకట్టుకునే రొమాంటిక్ నంబర్‌గా నిలబెట్టాయి.
విడుదలైన వెంటనే పాటకు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
