
Dasavataram to re release on November 28
కమల్ హాసన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘దశావతారం’ సుదీక్ష ఎంటర్టైన్మెంట్ ద్వారా నవంబర్ 28న గ్రాండ్ రీ-రిలీజ్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటనకు కొత్త నిర్వచనం చెప్పిన విశ్వనటుడు, పద్మశ్రీ, పద్మభూషణ్ కమల్ హాసన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నట విశ్వరూపానికి ప్రతీకగా నిలిచిన సంచలన చిత్రం ‘దశావతారం’ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. సుదీక్ష ఎంటర్టైన్మెంట్ ద్వారా నవంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది
దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తెరకెక్కించిన ఈ అద్భుత చిత్రంలో కమల్ హాసన్ పది విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంకేతికత, కథనం, నటన, మేకప్ పరంగా భారతీయ సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.
కాలం మారినా, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, కమల్ హాసన్ నటనలోని వైవిధ్యం, దశావతారం సృష్టించిన అద్భుతం ఎప్పటికీ ప్రత్యేకమే.
ఈ జన్మదిన వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు ‘దశావతారం’ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయడం అభిమానులకు, సినీ ప్రేమికులకు ఒక గొప్ప కానుకగా నిలవనుంది.
