Vijay Antony Badhrakali Releasing On September 5th Through Asian Suresh Entertainment
భారీ పీరియాడిక్ థ్రిల్లర్ తో రంగంలోకి దిగుతున్నకిరణ్ అబ్బవరం

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఈ రోజు చేశారు. పోస్ట్ కార్డ్ పై లెటర్ రాస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అభినయ వాసుదేవ్, సబ్ ఇన్స్ పెక్టర్ దీపాల పద్మనాభంకు రాస్తున్న లేఖను చూపించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11.01 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయబోతున్నారు.
ఈ సినిమాను వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కిరణ్ అబ్బవరం సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. కిరణ్ అబ్బవరం కొత్త సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.