Baarat Beat Song Released from Idupu Kayitham on the Occassion of Diwali

తెలంగాణ నేల, భాష, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్య కావ్యం ది ప్యారడైజ్-కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో హీరో నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల) ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. అనంతరం థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ:
“సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం గళమెత్తే తీరును ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. అణచివేతకు గురైన ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడి, ఆ సమాజాన్ని ఎలా ముందుండి నడిపించాడో చక్కటి కథాంశంతో ఆవిష్కరించారు.
ఈ అస్తిత్వ పోరాటానికి అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గారికి, హీరో సోదరుడు నాని గారికి, అలాగే చిత్ర నిర్మాణ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
తెలంగాణ నేల నేపథ్యంలో, సహజసిద్ధమైన తెలంగాణ యాస, భాషలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఒక గొప్ప కావ్యంలా సాగింది. అణచివేతకు గురైనప్పుడు ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూపిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమా నేపథ్యం, ఇందులో చూపించిన పోరాటానికి అసలైన ప్రేరణ ఎవరో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది.”
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, చారిత్రక పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కించిన చిత్ర యూనిట్‌ను కేటీఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
