K-Ramp 3rd Single Tikkal Tikkal.. Released -Grand Theatrical Release on

కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్, వీరప్పన్ కిడ్నాప్ కథాంశంతో చిత్రం.. త్వరలో ప్రారంభం
కాల భైరవ క్రియేషన్స్ శ్రీ విఘ్నేశ్వర చిత్రాలయ పతాకంపై అశోక్, ముని, నాగేష్ ప్రధాన పాత్రధారులుగా కట్ట శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో వి.లీల మనోహర్ నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ అక్టోబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు కట్ట శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, వీరప్పన్ కిడ్నాప్ కథాంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది. అప్పటి కిడ్నాప్ కోణంలో పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించడం జరుగుతుంది. ఈ చిత్రానికి ప్రతిభగల టెక్నీషియన్లు పని చేయనున్నారు. పూర్తి వివరాలు దసరా తర్వాత వెల్లడిస్తామని అన్నారు.
ఈ చిత్రానికి
సమర్పణ: SA గోవిందరాజులు,
కథ: బి అనయ్య,
స్క్రిప్ట్ రైటర్: బి రామ్మూర్తి,
సంగీతం: అర్జున్ జన్య
కెమెరా: కె. మనోహర్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పరిటాల రాంబాబు
పీఆర్వో: బి. వీరబాబు
కో ప్రొడ్యూసర్: మహాదేవ్, (కేంపన్న)
ప్రొడ్యూసర్: వి. లీలా మనోహర్
స్క్రీన్ప్లే, దర్శకత్వం: కట్ట శ్రీకర్ ప్రసాద్