Winning the National Award for Best Popular Film Providing Wholesome

బిగ్ బడ్జెట్ విజువల్ వండర్ “పరాక్” మూవీ అనౌన్స్ మెంట్
రోరింగ్ స్టార్ శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా “బ్రాండ్ స్టూడియోస్” హాలేష్ కోగుండి టీమ్ రూపొందిస్తున్న ఎక్సయిటింగ్ న్యూ మూవీ “పరాక్”ని అనౌన్స్ చేశారు. ఇది అభిమానులకు ప్రేక్షకులకు గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందని ప్రామిస్ చేసింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మార్చిలో సెట్స్‌పైకి రానుంది . పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ భారీ బడ్జెట్‌తో బిగ్ కాన్వాస్‌పై రూపొందుతోంది.
ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని, శ్రీమురళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, “బ్రాండ్ స్టూడియోస్” టీం ఈ చిత్రం పోస్టర్‌ను రిలీజ్ చేశారు, ఇది అభిమానులలో, సినీ ప్రేక్షకులలో క్యురియాసిటీని క్రియేట్ చేసింది.
ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
