Venkatesh | వెంకటేశ్ హీరోయిన్ ఫైనల్.. సెకండ్ హీరోయిన్ కోసం వేట..!
Venkatesh | టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా వస్తుందంటే క్యూరియాసిటీ బాగా ఉంటుంది. పక్కా ఎంటర్టైన్ మెంట్ గ్యారంటీ అని ప్రేక్షకులు ముందే ఫిక్సయిపోతారు. అలాంటి క్రేజీ కాంబోనే వెంకటేశ్ (Venkatesh) అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ ఇద్దరూ మరోసారి నవ్వులు పంచేందుకు రెడీ అవుతున్నారు.

ఎఫ్2, ఎఫ్ 3 తెరకెక్కించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై పలు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజా అప్డేట్ ఒకటి దానిపై క్లారిటీ ఇచ్చేస్తుంది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో ఫైనల్ అయినట్టు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుందట. అంతేకాదు కథానుగుణంగా రెండో హీరోయిన్ కూడా ఉండనుండగా.. ఇంతకీ ఎవరినీ తీసుకోబోతున్నారనన్నది సస్పెన్స్ నెలకొంది.
ఈ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. కామిక్ స్టైల్ ఉన్న అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్లో రాబోతున్న తాజా ప్రాజెక్ట్ హ్యాట్రిక్ హిట్‌గా నిలవడం ఖాయమని అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు సినీ జనాలు.