Tripti Dimri | యానిమల్ హీరోయిన్ Bad Newz ఓటీటీ ప్లాట్‌ఫాం ఇదే..!
Tripti Dimri | రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ సినిమాతో తెలుగుతోపాటు ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది ఉత్తరాఖండ్ భామ తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ భామ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం Bad Newz. విక్కీ కౌశల్, అమ్మి విర్క్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
Tripti Dimri | రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ సినిమాతో తెలుగుతోపాటు ఇండియావైడ్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది ఉత్తరాఖండ్ భామ తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించిన తృప్తి డిమ్రికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి. ఈ భామ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం Bad Newz. విక్కీ కౌశల్, అమ్మి విర్క్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా జులై 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫాం ఫైనల్ అయింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. పోస్టర్లు, ప్రమోషన్స్ తో ఇప్పటికే హైప్ క్రియేట్ అవుతోంది.
మరోవైపు విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ టీం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ థ్రియాట్రికల్ ట్రైలర్‌ను నేడు సాయంత్రం 4: 30 గంటలకు లాంఛ్ చేయనున్నారు.