Lopalliki Ra Cheptha 4th Single Tik Tok Chedama.. Released by

Thammudu will offer a big theatrical experience – Sapthami Gowda
After the blockbuster hit Sankranthi ki Vasthunnam another super hit film Thammudu is all set to arrive under the prestigious banner of Sri Venkateswara Creations, produced by Dil Raju and Sirish with Nithiin in the lead. The film is directed by Sriram Venu, with Laya, Varsha Bollamma, and Sapthami Gowda playing key roles. Thammudu is gearing up for a grand worldwide theatrical release on the 4th of this month. On this occasion, actress Sapthami Gowda, who plays the character of Ratna, shared her experience along with the highlights of the movie.
“After Kantara, I got a call from director Sriram Venu for Thammudu. I came to Hyderabad and did a look test. After the look test went well, they gave me the dialogue version. By then, the complete script of Ratna’s character was ready. They also told me to learn horse riding. We shot the film in Araku. Due to an injury to Nithiin’s shoulder, the shoot was delayed a bit. Working on Thammudu has been a great experience.”
“I play the role of Ratna, a girl from a village called Ambaragodugu. She is a fan of Pawan Kalyan. There’s also a different love story for my character. Some may feel that my look in Thammudu resembles my Kantara look, but as a character, Ratna is completely different. Thammudu has a slightly serious subject, but my character brings fun to the film. Laya garu, Nithiin garu visit the village of Ambaragodugu under certain circumstances. How Ratna becomes part of their journey is interesting. Without knowing their situation, I behave jovially with them, which creates humor for the audience. Ratna is not a radio jockey; what she truly is can be seen only in the film. I had to do horse riding scenes in hilly, rocky areas. Practicing horse riding for 3-4 hours daily was tough, but I’m satisfied with how those scenes turned out.”
“I know about Pawan Kalyan’s Thammudu movie. Director Venu garu told me about it. We all know how big a success that film was for Pawan Kalyan garu. I haven’t watched the complete movie yet. I will definitely watch it before the release of our Thammudu.”
“I believe this film will definitely give me a good name as an actress. Though my role is not lengthy, it’s an impactful one. Director Venu garu always said that among all the characters, he enjoyed writing Ratna’s role the most. I was also the first artist selected for the film.”
“In Thammudu, the characters played by me, Laya, Ditya, Varsha, and Swasika will all have importance. All five women characters are different and powerful. For example, the character Gutthi drives a bus. She even learned bus driving for this movie. Laya garu plays a strict officer. Myself, Varsha, and others also have action sequences. Usually, in movies, we see female characters singing songs with the hero, but here, audiences will see heroines fighting alongside the hero. The way women characters have been portrayed so strongly in Thammudu will definitely make female audiences feel proud and happy when they watch the movie in theatres.”
“There’s also a love track between Nithiin and me in the film. Our teenage love story gradually matures over time. By the end of the movie, the audience will root for Ratna and Nithiin’s characters to unite. I’m happy that my first Telugu film under Dil Raju garu’s Sri Venkateswara Creations is Thammudu. Only reputed banners can promote and release a film in such a grand manner. Director Sriram Venu garu has worked really hard for Thammudu. He designed every character perfectly. He didn’t compromise on getting the desired output, not just from artists but also from technicians.”
“Thammudu is a film that must be experienced in theatres for its grand scale and visuals. If you’ve seen the trailer and release trailer, you’d know how big this movie is going to be. A film like this will not have the same impact if watched at home. You can enjoy Thammudu to the fullest only in theatres.”
“I love doing commercial films. Thammudu is also a commercial film. I really liked Rashmika’s character in Pushpa. If I get such offers, I’m ready to do them. After Kantara’s success, I received many such offers, but I rejected most of them because they weren’t exciting enough. That’s the reason you haven’t seen me in many films. But if different roles come my way, I’ll definitely take them up. Currently, I’m working on two more Telugu films, along with projects in Tamil and Kannada. I’ll reveal those details soon. I want to work in all languages beyond boundaries.”
“తమ్ముడు” మూవీలో పవర్ ఫుల్ వుమెన్ క్యారెక్టర్స్ చూస్తూ మహిళా ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారు, ఈ సినిమా ఆడియెన్స్ కు బిగ్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది – హీరోయిన్ సప్తమి గౌడ
“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు రత్న క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరోయిన్ సప్తమి గౌడ.
– కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి “తమ్ముడు” మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ గారి భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. “తమ్ముడు” మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.
– అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది. “తమ్ముడు” కాస్త సీరియస్ సబ్జెక్ట్..ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ గారు కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ గారు ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్ గా ఉంటాను. అది ఆడియెన్స్ కు హ్యూమర్ ఇస్తుంది. రత్న రేడియో జాకీ కాదు. తను పాత్ర ఎలా ఉంటుందో మూవీలో చూడాలి. కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.
– పవన్ కల్యాణ్ గారి తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు గారు చెప్పారు. ఆ సినిమాతో పవన్ గారు ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారో మనందరికీ తెలుసు. నేను కంప్లీట్ మూవీ చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ గారి తమ్ముడు మూవీ చూస్తాను.
– “తమ్ముడు” సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు గారు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.
– “తమ్ముడు”లో నేను, లయ, దిత్య, వర్ష, స్వసిక..ఇలా మా అందరి క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. మా ఐదు వుమెన్ క్యారెక్టర్స్ డిఫరెంట్ గా, పవర్ ఫుల్ గా ఉంటాయి. గుత్తి క్యారెక్టర్ చూస్తే బస్ డ్రైవ్ చేస్తుంది. తను బస్ డ్రైవింగ్ ఈ మూవీ కోసం నేర్చుకుంది. లయ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ గా కనిపిస్తారు. నేను, వర్ష..ఇలా మా అందరికీ ఫైట్ సీక్వెన్స్ లు ఉంటాయి. సినిమాల్లో హీరోతో సాంగ్స్ పాడే హీరోయిన్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. కానీ ఇందులో ఫైట్ చేసే హీరోయిన్స్ ను చూస్తారు. వుమెన్ క్యారెక్టర్స్ ను ఇంత బలంగా తెరకెక్కించినందుకు రేపు థియేటర్స్ లో “తమ్ముడు” సినిమా చూసే మహిళా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతారు.
– ఈ మూవీలో నితిన్ తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు గారి ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు “తమ్ముడు” మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్ పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.
– బిగ్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం “తమ్ముడు” మూవీని చూడండి. మీరు ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ చూస్తే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో తెలుస్తుంది. ఇంట్లో ఇలాంటి సినిమా చూస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. థియేటర్ లోనే “తమ్ముడు” చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
– నాకు కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టమే. “తమ్ముడు” కూడా కమర్షియల్ మూవీనే. పుష్ప లో రశ్మిక చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కాంతార సక్సెస్ తర్వాత నాకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాల్లో మీకు నేను కనిపించకపోవడానికి కారణమదే. డిఫరెంట్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా. ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా. వాటి డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా. భాషాలకు అతీతంగా అన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా