
Script with Strong Content is very Important to my Films – Producer SKN
After the massive blockbuster Baby under the Mass Movie Makers banner, successful young producer SKN is now backing several promising projects. His current productions include Chennai Love Story with Kiran Abbavaram, the Hindi remake of Baby, and a couple of interesting films with debut directors. As SKN celebrates his birthday tomorrow (July 7), he shared insights about his journey as a producer and the progress of his upcoming films in an interview today.
– I’m a die-hard fan of the Mega family. I entered the industry with the desire to be close to them. Since childhood, I’ve been passionate about writing, I won first and second prizes at state-level essay and debate competitions. Naturally, I developed an interest in writing movie scripts. I started my career as a PRO. It was Maruthi who encouraged me to transition into production by asking me, ‘Are you planning to stay a PRO forever? I’ll direct; you produce.’ That’s how I, along with Shreyas Srinivas, produced Ee Rojullo under his direction. The success of that film marked the beginning of my journey as a producer.”
– Work on the Hindi remake of Baby is progressing well. In Telugu, we don’t spend much time on pre-production, but in Hindi, they invest significantly in that phase. We plan to start shooting next month. The Hindi version will be even more intense than the Telugu one. Music sittings and other pre-production works are happening at a rapid pace.
– I’ve thoroughly enjoyed every phase of my career — be it as a journalist writing articles, a PRO handling innovative publicity, or as a producer making good films with limited budgets. One of the biggest blessings in my career is the trust placed in me by industry stalwart Allu Aravind garu. It’s because of the freedom and encouragement he gave me that I could collaborate with banners like UV Creations, People Media Factory, Geetha Arts, and Mythri Movie Makers. I’ll always be grateful to him.
– My friend Bunny Vas has excellent judgment when it comes to stories. He also has a good grip on music and editing. He can predict which scenes will work well with audiences. I keep learning from him constantly. His ability to stay composed during tough times is remarkable. When Pilla Nuvvu Leni Jeevitham was 80% complete, actor Srihari garu, who played a crucial role, passed away. I went to inform Bunny Vas, and he simply said, ‘There’s nothing we can do. Let’s go play shuttle.’ That’s how cool-headed he is, even during tough situations.
– We are committed to introducing Telugu girls as heroines. We’ve already introduced seven to eight of them and will be introducing two or three more soon. We’re not just introducing heroines, but also providing opportunities in other departments. We’ll soon introduce lady directors too.
– We will begin shooting the Hindi Baby next month. Chennai Love Story is currently on sets. We’re introducing a talented director named Krishna with this film. The official pooja ceremony will be held later this month. Along with a familiar heroine, the film will feature two young heroes. We’re also launching a project with Avinash, who worked on Hari Hara Veera Mallu, as director. It will feature a Kannada star hero and a mid-range Telugu hero. Both these projects will start soon. After Raja Saab, I’ll be collaborating with Maruthi on one project and Sai Rajesh on another. Meanwhile, Season 2 of 3 Roses web series is getting ready for streaming on Aha.
– We are making both big and small films. Regardless of scale, the story must be strong. We had the confidence in Baby, which is why we organized 100 premieres. For big films, even a single premiere requires careful consideration. Today’s audiences are sharper than us. No matter how much hype you create, if there’s no solid content, people won’t show up at theatres. The only thing that truly wins over audiences is content. All the projects we are doing, including Chennai Love Story, are backed by exciting scripts and strong content.
– I’m not in a position to advise the industry, but coming from a journalism background, I’ll share my honest views. The industry is currently in a phase of reality checks. Unless you have passion, don’t enter production. This isn’t a business where you put in ten rupees and expect twenty back. If it works, there’s profit; if not, you lose everything. Being a producer is like sitting on a throne full of thorns. Those attracted by the glamour of the industry will only face losses if they step into production blindly.
– You’ve all seen the massive pan-India response for the Raja Saab teaser. It perfectly matches Prabhas garu’s global image. Audiences and fans have been waiting for years to see Prabhas in this kind of avatar, and Raja Saab will deliver exactly that. Any doubts people had were cleared with the teaser. We are currently working on completing the remaining shoot. Raja Saab will have a grand theatrical release on December 5.
– For me, cinema is everything. I have no other business. Every Friday, I watch movies, and all my discussions revolve around films. Even on social media, I only engage in film-related conversations. The only time I stayed away from theatres was during the COVID lockdown.
– Everyone in the industry has their own theories. But one thing is clear, due to the OTT boom during the pandemic, audiences have developed a taste for strong content. Regular, formulaic films no longer work. Despite lavish productions and high remunerations, if the content isn’t solid, the investment vanishes. We thought we could rely on non-theatrical revenue streams like satellite, OTT, and Hindi rights, so budgets kept increasing. That bubble has now burst. We have to return to our roots making theatrical films that people genuinely enjoy.
– In Hindi and Malayalam, there’s an 8-week window before films hit OTT platforms. That’s why even small Malayalam films are grossing ₹200 crores. If a Hindi film clicks, there’s no limit to the collections. In Telugu, because of quick OTT releases, audiences hesitate to visit theatres, thinking the film will stream soon anyway. With a limited theatrical window, producers try to maximize earnings by increasing ticket prices. But that’s backfiring. It’s okay to hike ticket prices for select big-ticket films aimed at the national market, but applying that logic to every film is wrong. Affordable ticket prices will bring audiences back to theatres. If you look at social media, most discussions are around ticket pricing and content. Based on a hero’s image and the content, one can increase a film’s budget, but not otherwise.
– I never intended to become a producer, but here I am. I’m even producing a Bollywood film now. What lies ahead depends on time, my hard work, and the results they bring. I have no plans of becoming an actor or director. I’ve always had moral support from Allu Arjun. Whenever I take risks or try something new, I feel confident knowing Bunny is there for me. His target is to do two films every year within the next year and a half.
ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్, స్ట్రాంగ్ కంటెంట్ తో థియేట్రికల్ గా ఎంజాయ్ చేసే సినిమాలే నిర్మిస్తా – సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో “బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ యంగ్ నిర్మాత ఎస్ కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ”, హిందీ “బేబి”తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. రేపు (జూలై 7న) పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ కేఎన్ నిర్మాతగా తన కెరీర్ విశేషాలను, ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు.
– నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి వ్యాసరచన పోటీలు, డిబేట్స్ లో రాష్ట్రస్థాయిలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించాను. అలా సినిమా స్క్రిప్ట్స్ రాయాలనే ఆలోచనలు కూడా ఉండేవి. తర్వాత పీఆర్ఓగా కెరీర్ స్టార్ట్ చేశా. కొన్నాళ్లకు మారుతి..ఇలా పీఆర్ఓ గా ఉండిపోతావా అని అంటూ నేను డైరెక్షన్ చేస్తా, మీరు ప్రొడ్యూస్ చేయండని ప్రోత్సహించాడు. మారుతి డైరెక్షన్ లో నేను, శ్రేయాస్ శ్రీను కలిసి ఈ రోజుల్లో మూవీ నిర్మించాం. ఆ సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్ గా నా జర్నీ మొదలైంది.
– హిందీ బేబి పనులు జరుగుతున్నాయి. మనం ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకోం కానీ హిందీలో ప్రీ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తారు. నెక్ట్స్ మంత్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. తెలుగులో కంటే ఇంటెన్సివ్ గా హిందీ బేబి ఉంటుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ సహా ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
– జర్నలిస్ట్, పీఆర్ఓ, ప్రొడ్యూసర్..ఇలా నా కెరీర్ లోని ప్రతి దశను ఎంజాయ్ చేశాను. జర్నలిస్ట్ గా ఒక ఆర్టికల్ రాసినప్పుడు, పీఆర్ఓగా డిఫరెంట్ గా పబ్లిసిటీ కల్పించినప్పుడు, ప్రొడ్యూసర్ గా తక్కువ బడ్జెట్ లో మంచి కథలతో మూవీస్ చేసినప్పుడు..ఏ పనైనా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యే చేశాను. ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్న అల్లు అరవింద్ గారు నాపై నమ్మకం పెట్టుకోవడం అనేది నా అదృష్టం. నేను యూవీ క్రియేషన్స్ తో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో, గీతా ఆర్ట్స్ తో, మైత్రీ వాళ్లతో కలిసి సినిమాలు చేస్తున్నానంటే అందుకు అరవింద్ గారు ఇచ్చిన స్వేచ్ఛ, ప్రోత్సహమే కారణం. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
– నా స్నేహితుడు బన్నీవాస్ కు కథపై మంచి జడ్జిమెంట్ ఉంటుంది. మ్యూజిక్, ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంటుంది. ఏ సన్నివేశాలు బాగా వర్కవుట్ అవుతాయో ఆయన బాగా గెస్ చేయగలరు. ఇవన్నీ నేను బన్నీవాస్ నుంచి నేర్చుకుంటుంటా. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా నిలబడటం బన్నీవాస్ ప్రత్యేకత. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా 80 పర్సెంట్ కంప్లీట్ అయ్యాక ఆ సినిమాలో కీలక పాత్ర చేసిన శ్రీహరి గారు స్వర్గస్తులయ్యారు. ఆ విషయం చెప్పేందుకు నేను బన్నీవాస్ దగ్గరకు వెళ్తే ..మనం ఏ చేయలేం కదా షటీల్ ఆడుకుందాం రా అని పిలిచాడు. కష్టం వచ్చినా అంత కూల్ గా వ్యవహరిస్తాడు.
– తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏడెనిమిది మందిని పరిచయం చేశాం. మరో ఇద్దరు ముగ్గురిని త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. హీరోయిన్స్ గానే కాదు వివిధ విభాగాల్లోనూ అవకాశాలు ఇస్తున్నాం. లేడీ డైరెక్టర్స్ ను కూడా పరిచయం చేస్తాం.
– హిందీ బేబి మూవీ నెక్ట్స్ మంత్ షూటింగ్ ప్రారంభిస్తాం. చెన్నై లవ్ స్టోరీ సెట్స్ మీద ఉంది. కృష్ణ అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ మూవీ పూజా ఈ నెలాఖరులో చేస్తాం. ఈ చిత్రంలో ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్ తో పాటు ఇద్దరు యంగ్ హీరోఎస్ ఉంటారు. హరి హర వీరమల్లు మూవీకి వర్క్ చేసిన అవినాష్ ను డైరెక్టర్ గా పెట్టి కన్నడ లోని ఓ స్టార్ హీరో, మన తెలుగు నుంచి మిడ్ రేంజ్ హీరో కలిపి ఓ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈ రెండు మూవీస్ వెంటనే ప్రారంభిస్తున్నాం. అలాగే రాజా సాబ్ తర్వాత మారుతితో ఒక సినిమా, సాయి రాజేశ్ తో మరో సినిమా చేయబోతున్నాం. ఆహాలో త్రీ రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
– ప్రస్తుతం పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా చేస్తున్నాం. చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా కథ బాగుండాలి. మేము కథ మీద నమ్మకంతోనే బేబి మూవీకి వంద ప్రీమియర్స్ వేశాం. పెద్ద మూవీస్ కు కూడా ఒక్క ప్రీమియర్ వేయాలంటే ఆలోచిస్తారు. ఈ రోజు ప్రేక్షకులు మనకన్నా పది రెట్లు షార్ప్ గా ఉన్నారు. ఎంత హంగామా చేసినా సినిమాలో కంటెంట్ లేకుంటే థియేటర్స్ కు రావడం లేదు. ప్రేక్షకుల్ని మెప్పించే ఒకే ఒక అంశం కంటెంట్. ఇప్పుడు మా నిర్మాణంలో ఉన్న చెన్నై లవ్ స్టోరీ తో పాటు మిగతా అన్ని ప్రాజెక్ట్స్ లో స్క్రిప్ట్ ఎగ్జైట్ చేసి, స్ట్రాంగ్ కంటెంట్ తో ఉన్నవే చేస్తున్నాం.
– ఇండస్ట్రీకి సలహాలు ఇచ్చేంత పెద్దవాడిని కాదు, కానీ ఒక జర్నలిస్ట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అనిపించినవి చెప్తా. రియాల్టీ అనే సైకిల్ లో ఇండస్ట్రీ ఇప్పుడు ఉంది. ప్యాషన్ ఉంటే తప్ప ప్రొడక్షన్ లోకి రావొద్దు. ఇక్కడ పది రూపాయిలు పెడితే ఇరవై వస్తుందని అనుకోవద్దు. పోతే మొత్తం పోతుంది. వస్తే లాభం వస్తుంది. మన కష్టం అంతా ఒక్కరోజులో ఊడ్చిపెట్టుకుపోవచ్చు. నిర్మాతగా ఉండటం అనేది ముళ్లున్న సింహాసనం లాంటిది. ఇక్కడి గ్లామర్ కు ఆకర్షితులై ప్రొడక్షన్ లోకి వస్తే నష్టపోతారు.
– రాజా సాబ్ టీజర్ కు పాన్ ఇండియా వైజ్ గా ఎలాంటి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందో మీరంతా చూశారు. ప్రభాస్ గారికి గ్లోబల్ గా ఉన్న ఇమేజ్ కు తగ్గట్టుగానే రెస్పాన్స్ ఉంది. ప్రభాస్ ను ఎలా చూడాలని పదేళ్లుగా ప్రేక్షకులు, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో అలా రాజా సాబ్ లో చూడబోతున్నారు. రాజా సాబ్ మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే అవి టీజర్ తో పోయాయి. ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ చేస్తున్నాం. డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాజా సాబ్ వస్తుంది.
– నాకు సినిమానే లోకం, మరో వ్యాపకం లేదు. ప్రతి ఫ్రైడే మూవీ చూస్తుంటాం. సినిమాల గురించే డిస్కషన్స్ చేస్తుంటా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా సినిమాల గురించే స్పందిస్తుంటా. థియేటర్స్ లో నేను సినిమాలు చూడలేక దూరంగా ఉన్నది ఒక్క కరోనా టైమ్ లోనే.
– ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక థియరీ ఉంటుంది. మనం ఎవరికీ చెప్పనక్కర్లేదు. కరోనా టైమ్ లో ఓటీటీలు చూడటం వల్ల మన ప్రేక్షకులు స్ట్రాంగ్ కంటెంట్ కు అలవాటు పడ్డారు. మామూలుగా సినిమా ఉంటే ఎవరికీ నచ్చడం లేదు. భారీ రెమ్యునరేషన్స్, లావిష్ ప్రొడక్షన్ చేసి కంటెంట్ లేకుంటే పెట్టుబడి మొత్తం పోతుంది. నాన్ థియేట్రికల్ బాగా పే చేస్తుందని బడ్జెట్స్ పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి హీరోలకు నచ్చజెప్పుకోవాలి. మనం జ్వరం వస్తే పత్యం చేస్తాం. అన్నీ తినేస్తా అంటే మొత్తం పాడవుతుంది. ఇండస్ట్రీ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంది.
– శాటిలైట్, హిందీ రైట్స్, ఓటీటీ..ఇలా ఒక్కో టైమ్ లో ఒక్కోటి ప్రొడ్యూసర్స్ కు బాగా పే చేస్తూ వచ్చింది. ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్ లో బాగా ఆడిన చిత్రాలే లాభాలు తీసుకొచ్చాయి. ప్రొడ్యూసర్స్ కూడా థియేటర్స్ లో ఆడిన సినిమాలే మనకు మంచివి అని గట్టిగా నమ్మితే ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు బాగుంటాయి. హీరో, డైరెక్టర్ క్రేజీ కాంబోలో ఓటీటీ కోసం ఒక మూవీ చేసి అక్కడే మనకు 80 పర్సెంట్ వస్తుందనే ప్రాజెక్ట్స్ కొన్ని ఇటీవల వచ్చాయి. ఆ బబుల్ కూడా ఇప్పుడు బరస్ట్ అయ్యింది. మళ్లీ మన పాత రూట్స్ లోకి వచ్చి థియేట్రికల్ గా ఎంజాయ్ చేసే సినిమాలు చేయాల్సిఉంది.
– హిందీ, మలయాళంలో ఓటీటీలకు 8 వీక్స్ టైమ్ పెట్టుకున్నారు. అందుకే మలయాళంలో చిన్న చిత్రాలు కూడా 200 కోట్ల రూపాయల దాకా వసూళ్లు చేస్తున్నాయి. హిందీలో సినిమా బాగుంటే ఆకాశమే హద్దుగా కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో త్వరగా ఓటీటీలకు ఇవ్వడం వల్ల థియేటర్స్ కు వచ్చేందుకు ఆడియెన్స్ ఆలోచిస్తున్నారు. ఓటీటీలో వస్తుందిలే అనుకుంటున్నారు. థియేట్రికల్ గా ఉన్న టైమ్ కొంతే కాబట్టి ఉన్నంతలో ఆదాయం పొందాలని టికెట్ రేట్స్ పెంచుతున్నాం. టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉండటం కూడా ఆడియెన్స్ రాకపోవడానికి కారణం. తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఒకట్రెండు సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకుంటే ఓకే గానీ ప్రతి సినిమాకు అలా అవకాశం ఉందని రేట్స్ పెంచడం కరెక్ట్ కాదు. అందుబాటు ధరల్లో టికెట్స్ ఉంటే మళ్లీ థియేటర్స్ కు ఆడియెన్స్ ను ఆకర్షించవచ్చు. మనం సోషల్ మీడియాలో చూస్తే ప్రేక్షుకులు టికెట్ రేట్స్, కంటెంట్ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. హీరో ఇమేజ్, కంటెంట్ ఈ రెండింటినీ బేస్ చేసుకుని మూవీ బడ్జెట్ పెంచుకోవచ్చు.
– నేను ప్రొడ్యూసర్ కావాలని ఇండస్ట్రీకి రాలేదు. అయ్యాను. బాలీవుడ్ లో కూడా మూవీ చేస్తున్నా. నా నెక్ట్స్ ఏంటి అనేది కాలం, నేను చేసే కష్టం, అది ఇచ్చే ఫలితం చెబుతాయి. ఫ్యూచర్ లో హీరోగా, డైరెక్టర్ గా మారే ఆలోచన లేదు. అల్లు అర్జున్ నుంచి నాకు మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను ఏదైనా ముందడుగు వేస్తుంటే, రిస్క్ చేస్తుంటే పడిపోతాననే భయం లేకుండా బన్నీ ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది. ఏడాదిన్నరలో రెండు చిత్రాలు చేయాలనేది అల్లు అర్జున్ టార్గెట్ గా పెట్టుకున్నారు.