ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
శ్వాగ్ స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా ఎంగేజింగ్ గా వుంటుంది – హీరో శ్రీవిష్ణు
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
శ్వాగ్ సినిమా గురించి, ఇందులో మీ రాజ్యం గురించి చెప్పండి ?
- శ్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్ ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్ గా ‘శ్వాగ్’ అని టైటిల్ పెట్టాం.
- శ్వాగ్ ఒక వంశానికి సంబధించిన కథ. మాత్రు, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవంత్సవంలో మొదలయ్యే కథ. మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కథ ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది.
- నేను ఎప్పుడూ డ్యుయల్ రోల్స్ చేయలేదు. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో వుండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు వున్నప్పడు ఎలా చేయాలనేది ఛాలెంజ్ గా అనిపించింది. వన్స్ గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక.. చాలా బాగా కుదిరింది.
- సినిమా చాలా బావొచ్చింది. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్ళకి సినిమా విపరీతంగా నచ్చుతుంది. అలాగే యంగ్ ఆడియన్స్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో వున్నాయి. సినిమా చూసి పేరెంట్స్ ని కూడా సినిమాకి తీసుకువెళ్తారు. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో వున్నాయి. మన వంశం గురించి, పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటనేది ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది.
- చాలా పెద్ద కథ ఇది. రెండున్న గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా అని సినిమా చూసిన తర్వాత దర్శకుడిని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే ఎంటర్టైన్మెంట్ వుంటుంది. అందరి ఆడియన్స్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నా కెరీర్ లో ఈ సినిమా వన్ అఫ్ ది టాప్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకం వుంది.
రాజ రాజ చోర తర్వాత మీరు, హసిత్ గోలి, పీపుల్ మీడియా కలసి సినిమా చేయాలన్నప్పుడు ఎలాంటి డిస్కర్శన్ జరిగింది? - రాజ రాజ చేస్తున్నప్పుడు సెకండ్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ప్రాజెక్ట్ చేసుకోమని చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మమ్మల్ని నమ్మి రాజరాజ చోర సినిమా ఇచ్చింది. చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి మంచి సక్సెస్ అవుతుంది.
శ్వాగ్ టైటిల్ లో డాగ్స్ కనిపిస్తాయి.. దాని గురించి చెప్పండి ? - శ్వాగనిక వంశ రాజులు సింహాసనాలపై కూర్చుకున్నప్పుడు పక్కన డాగ్స్ ని పెట్టుకుంటారు. డాగ్స్ ని గుంపులు వేసుకొని వస్తుంటారు. అదొక సింబాలిక్ గా టైటిల్ లో పెట్టాం.
- ఇందులో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ బాగా కుదిరాయి. రీతూ వర్మ క్యారెక్టర్ లో చాలా మంచి ట్రాన్స్ ఫర్మేషన్ వుంటుంది. ఈ సినిమా చూసాక ఆడవాళ్ళని ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. భవభూతి క్యారెక్టర్ ని కూడా సినిమా పూర్తయిన తర్వాత ఆడవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. ఈ సినిమా చూసినప్పుడు నటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి.
ఇందులో మీకు కష్టమైన క్యారెక్టర్ ఏమిటి ? - సింగ క్యారెక్టర్ కొంచెం ఈజీ అనిపించింది. మిగతా మూడు కష్టమైనవే. వాటి గెటప్, బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డిక్షన్ దేనికవే ప్రత్యేకం. రోజుకి నాలుగున్న గంటల సేపు మేకప్ వేసుకోవడం, మళ్ళీ దాన్ని తీయడానికి మరో రెండు గంటల సమయం పట్టడం.. ఇదంతా చాలా టఫ్. అయితే రేజర్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చిన అనుభూతి కలిగింది. అందరూ వందశాతం ఎఫర్ట్ పెట్టి సినిమా చేశారు. కింగ్ ఎపిసోడ్స్ కి మోనో లాగ్స్ వున్నాయి. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టిస్ చేశాం. ఇందులో 90 ఇయర్స్ క్యారెక్టర్ కూడా వుంటుంది. అది చాలా బావొచ్చింది.
‘శ్వాగ్’ లో నాలుగు తరాలని చూపించారు కదా? స్క్రీన్ ప్లే ఎలా వుంటుంది ? - ఒక కుటుంబం కథ చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమేయ్యేలా వుండాలి. ఎలాంటి కన్ఫ్యుజన్ వుండకూడదు. శ్వాగ్ లో స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా చాలా ఎంగేజింగ్ గా వుంటుంది. సింపుల్ గా వుంటునే చాలా కొత్తగా వుంటుంది.
మీరా జాస్మిన్ గారి క్యారెక్టర్ గురించి ? - మీరా జాస్మిన్ గారు చాలా అద్భుతంగా చేశారు. 90లో మదర్ లాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ని చూసినప్పుడు అందరి మదర్స్ గుర్తుకు వస్తారు. ఆ పాత్ర చాలా హుందాగా హోమ్లీ గా వుంటుంది. యునానిమస్ గా అందరికీ నచ్చుతుంది.
వివేక్ సాగర్ మ్యూజిక్ గురించి ? - వివేక్ తో బ్రోచేవారెవరురా, రాజ రాజ చేశాను, ఇది మూడో సినిమా. పాటలు సిట్యువేషన్ కి తగ్గట్టుగా వుంటాయి. బీజీఎం థియేటర్స్ లో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది.
ప్రేక్షకులు ఏం ఆశించి సినిమాకి రావాలి? - కొత్త కథ. ప్రతి ఇరవై నిమిషాలకు అబ్బురపరిచే ట్విస్ట్ వుంటుంది. సర్ ప్రైజ్ లు వుంటాయి. ప్యూర్ కంటెంట్ సినిమా. పండగ సినిమాల్లో తప్పకుండా ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా.
కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఓ ఎంటర్ టైనర్ చేస్తున్నాను.
ఆల్ ది బెస్ట్ - థాంక్ యూ