శనివారమే పెట్టడానికి అదిరిపోయే ఎమోషనల్ రీజన్ వుంది – నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నేచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో ‘సరిపోదా శనివారం’ విశేషాలని పంచుకున్నారు.
మీరు సినిమాకి ఎంత ఎఫెర్ట్ పెడతారో.. ప్రమోషన్స్ కి కూడా అంతే ఎఫెర్ట్ పెడుతుంటారు. దాదాపు నెల రోజులు కేటాయిస్తుంటారు కదా?
-పెట్టాలని అర్ధమైయిందండి. ఇంతకుముందు నాకు కూడా ఆ థాట్ లేదు. కంటెంట్ సినిమాని చూసుకుంటుందనే ఫీలింగ్ వుండేది. నిజంగానే కంటెంట్ సినిమాని చూసుకుంటుంది. అయితే అది రిలీజ్ అయిన తర్వాత. రిలీజ్ కి ముందు పాజిటివిటీ, అందరికి రీచ్ చేయడం మన బాధ్యత. రెగ్యులర్ గా సినిమాని ఫాలోఅయ్యేవారికి సినిమా గురించి ఆటోమేటిక్ గా తెలుస్తుంది. అలాకాకుండా రెగ్యులర్ గా ఫాలోకాని వారు, పనుల్లో బిజీగా వున్నవారి దగ్గరకి మన సినిమా ఇన్ఫర్మేషన్, ఐడియా తీసుకువెళ్ళాలంటే అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయాలి. ఆసక్తిని కలిగించాలి. సినిమా చుడాలనే థాట్ ని ట్రిగ్గర్ చేయడం చాలా పెద్ద పని.
‘సరిపోదా శనివారం’లో మీకు ఎక్సయిట్ చేసిన పాయింట్ ఏమిటి?
-ట్రైలర్ లో ఏదైతే చూపించామో అది నాకు బాగా ఎక్సయిట్ చేసింది. దాని నెరేటివ్ ఎలా ఉంటుందనే మీరు సినిమాలో చూడాలి. ఐడియా ని ట్రైలర్ లో చెప్పాం. ఆ ఐడియాని ఎలా ఎగ్జిక్యూటివ్ చేశామనేది తెలియాలంటే సినిమా చూడాలి.
‘సరిపోదా శనివారం’లో మీకు ఛాలెజింగ్ గా అనిపించిన పార్ట్ ఏమిటి ?
- ఛాలెజింగ్ అంటూ ఏమీ లేదు. చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. జనరల్ గా నా సినిమాలన్నిటిలో తెలియని ఒక బరువుని మోస్తుంటాను. అది ఈసారి ఎస్జే సూర్య గారిమీద, వివేక్ మీద వుంది. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాను. పెర్ఫార్మెన్స్ పరంగా ఎస్జే సూర్య, ప్రియంక, మురళీశర్మ.. ఇలా అందరిపై భారం వుంది.
ఎస్జే సూర్య గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? - ఎస్జే సూర్య గారితో కలసి పెర్ఫార్మ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఆయనకి చాలా అండర్ స్టాడింగ్ వుంటుంది. పెర్ఫార్మెన్స్ లో ఆయన నుంచి ఒక కొత్త పెర్స్పెక్టివ్ ని నేర్చుకోవచ్చు. ఆ రోల్ కి ఆయన తప్పితే మరో చాయిస్ లేదు. డబ్బింగ్ దాదాపు ఏడు రోజులు చెప్పారు. అద్భుతంగా వచ్చింది. తన డబ్బింగ్ కోసం మరో రెండుసార్లు సినిమా చూస్తారు.
-సరిపోదా శనివారం చాలా మంచి కథ. అడ్రినలిన్ పంపింగ్ మూమెంట్స్ వుంటాయి. కథ ప్రకారం ఆ అడ్రినలిన్ పంపింగ్ వందశాతానికి తీసుకెళ్ళాం. సినిమా చాలా ఆర్గానిక్ గా కుదిరింది. థియేటర్స్ లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి ?
-‘సరిపోదా శనివారం’చాలా రేసీ ఫిలిం. నెరేటివ్ కూడా రేసీగా వుంటుంది. సినిమా పరిగెడుతుంటుంది. ఇలాంటి పరిగెడుతున్న సినిమాకి ఏం స్కోర్ చేస్తాడనే ఒక క్యురియాసిటీని వుండేది. నిన్న వెళ్లి ఆర్ఆర్ చూశా. బేసిగ్గా సినిమాల్లో హీరోకి ఇంట్రో సాంగ్ వుంటుంది. తర్వాత మేలోడీలు, ఎమోషనల్ సాంగ్స్ వస్తాయి. అందులో బిట్స్ ని ఆర్ఆర్ గా పంప్ చేస్తుంటారు. కానీ జేక్స్.. మొత్తం సినిమాని హీరో ఇంట్రో సాంగ్ లా కొట్టాడు. తన మ్యాజిక్ 29న చూస్తారు.
అంటే సుందరానికీ విడుదల తర్వాత మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారని వివేక్ చెప్పారు ? - అంటే సుందరానికీ చాలా మందికి ఫేవరేట్ సినిమా. ఆ జోనర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి అది అల్ టైం ఫేవరేట్ లో ఒకటి. అయితే రిలీజైన రోజుల్లో ఆ సినిమా రన్ టైం, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని కామెంట్స్ వినిపించాయి. అలాంటి సమయంలో ‘నేను సరిగ్గానే చేశానా?’ అనే డౌట్స్ తనలో ఉండేవి. భాద్యత తీసుకున్న వారికి ఇలాంటి డౌట్స్ వుండటం సహజం. అలాంటి సమయంలో తన బలాన్ని గుర్తు చేస్తూ నేను తన పక్కన ఒక బ్రదర్ లా వున్నాను. తను టెర్రిఫిక్ డైరెక్టర్.
-‘సరిపోదా శనివారం’కి రన్ టైం, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్. మేము అనుకున్న ఐడియా, సెటప్,పే అఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మేము ఎలా చేయాలని అనుకునన్నామో అలా చేశాం.
సినిమాకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారని నిర్మాత దానయ్య గారు చెప్పారు?
-నా ప్రతి సినిమాకి ఇలానే చేస్తానండి. నా డైరెక్టర్ కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లా పని చేస్తాను. నా నిర్మాతలందరూ హ్యాపీగా వుండాలని కోరుకుంటాను. సినిమా రిలీజైన తర్వాత అందరూ హ్యాపీగా వున్నారని తెలిస్తేనే సక్సెస్ అని ఫీలౌతాను.
ఈ సినిమాకి శనివారమే పెట్టడానికి కారణం ఏమిటి ? - అదిరిపోయే ఎమోషనల్ రీజన్ వుంది. నా ఫేవరేట్ మూమెంట్ అది. సినిమా స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాలకి వస్తుంది.
సోకులపాలెం ఇందులో కీ ఎలిలెంట్ గా ఉంటుదని విన్నాం?
-ఈ కథలో సోకులపాలెం ఒక ఎంటిటి. బ్యాక్ గ్రౌండ్ అండర్ లైన్ ఎమోషన్. సూర్య, దయ, చారుతల పాత్రల మధ్య జరిగే కథ, ఆ కథకు ఎమోషన్ ని యాడ్ చేసేది సోకులపాలెం.
‘సరిపోదా శనివారం’ ని ప్రాంచైజ్ గా తీసుకువెళ్ళాలనే ఆలోచన ఉందా ?
-పాజిబులిటీ అయితే వుంది. ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేస్తే పాజిబులిటీ వుంది.
ఇందులో యాక్షన్ పార్ట్ ఛాలెజింగ్ గా అనిపించిందా ?
-ఇందులో 20 పెర్సెంట్ యాక్షన్, 80 పెర్సెంట్ యాక్షన్ మూడ్ వుంటుంది. ఇందులో యాక్షన్ మూడ్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
‘సరిపోదా శనివారం’ స్క్రీన్ ప్లే ఎలా వుంటుంది ?
-‘సరిపోదా శనివారం’ స్క్రీన్ ప్లే, నెరేటివ్ చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది.
దసరా తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా.. అప్పటికి ఇప్పటికి రెస్పాన్స్ ఎలా వుంది ?
-నిజంగా అంత ప్రేమని నేను ఊహించలేదు. వేరే రాష్ట్రాలలో ఈవెంట్ కి వస్తున్న జనాలని చూస్తుంటే ఇలా ఎలా వస్తున్నారని సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. సినిమా సినిమాకి చాలా ఆదరణ పెరుగుతోంది. ఇది భాద్యతని మరింత పెంచుతోంది.
మీ జర్నీలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ?
-పర్శనల్ లైఫ్ లో అయితే జున్ను బర్త్ డే. సినిమాల విషయానికి వస్తే మారుతూవుంటుంది. దసరా సినిమాని సుదర్శన్ లో చూసినప్పుడు చాలా మెమరబుల్ గా అనిపించింది. ఈ సినిమాతో మరో ఫ్రెష్ మెమరీ రాబోతోంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ