
మేఘాలు చెప్పిన ప్రేమ కథ చాలా మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ – నిర్మాత ఉమా దేవి కోట & డైరెక్టర్ విపిన్
యంగ్ హీరో నరేష్ అగస్త్య, దర్శకుడు విపిన్ దర్శకత్వంలో, సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఉమా దేవి కోట, డైరెక్టర్ విపిన్ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మేఘాలు చెప్పిన ప్రేమ కథ.. మంచి తెలుగు టైటిల్ పెట్టారు. ముందుగా అభినందనలు
-థాంక్యూ. సినిమా అంతా చాలా చక్కని తెలుగు ఉంటుంది. మాటల ఉచ్చరణలో కూడా అచ్చమైన తెలుగుని ఆడియన్స్ వింటారు. ఈ క్రెడిట్ మా డైరెక్టర్ కి దక్కుతుంది. మా డైరెక్టర్ తెలుగు ప్రియుడు, కవి.
ఈ ప్రేమ కథలో కొత్తదనం ఏమిటి?
-ఒక మనిషి మరో మనిషి చూసినప్పుడు ఎలా ఇన్స్పైర్ అవుతారు.. ప్రేమ ఎలా పుడుతుంది అనేది ఈ కథలో మీరు చూస్తారు. ప్రేమ ఇన్స్పైర్ తో పాటు కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తుంది. ఆ ఆ కోణం కూడా ఈ కథలో ఉంటుంది.
రాధిక గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఇందులో రాధిక గారు హీరో గారి గ్రాండ్ మదర్ గా కనిపిస్తారు. ఆవిడ చాలా మంచి సింగర్. కానీ కొన్ని కారణాల వల్ల పాడడం మానేసి మామూలు ఫ్యామిలీ లైఫ్ గడుపుతారు. అలా గడిపినప్పుడు ఆవిడ ఎంత ఫీలై ఉంటారు? ఎంత బరువు మోసి ఉంటారు? అనే అనేది ఆ క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. రాధిక గారు స్క్రీన్ ప్రజెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. హీరో క్యారెక్టర్ ని ఇన్స్పైర్ చేసే క్యారెక్టర్ అది. ఈ సినిమా రోలింగ్ వరకు కూడా చూడాలని కోరుకుంటున్నాను. రోలింగ్ టైటిల్ వచ్చే సీన్ అందరికీ నచ్చుతుంది.
ఇది మ్యూజికల్ స్టోరీనా?
-ఇందులో హీరోది మ్యూజికల్ గా ప్రూవ్ చేసుకోవాలనుకునే క్యారెక్టర్. ఈ సినిమా కోసం ట్రావెన్ కోర్ ప్రిన్స్ ని నటింప చేయడం జరిగింది. ఆయన శాస్త్రీయ సంగీతం కోసం చేసిన సేవ మనం ఊహించలేము. అలాంటి ఒక క్యారెక్టర్ ని పరిచయం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ గురించి?
-జస్టిన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో విజువల్స్ మ్యూజిక్ ఆడియన్స్ కి ఒక గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాయి. తెలుగులో చాలా రోజుల తర్వాత మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ వచ్చిందని ఆడియన్స్ ఫీల్ అవుతారు.
-జస్టిన్ స్లో పాయిజన్ లాంటి మ్యూజిక్ ఇచ్చాడు. రెహమాన్, కృష్ణ కాంత్ అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు. ఇందులోని పాటలు ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి.
ఒక కొత్త ప్రొడ్యూసర్ గా నిర్మాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
సినిమా చేసినప్పుడు ఏ డిఫికల్టీస్ లేవు.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హాయిగా సాగింది. కానీ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు అసలైన సవాళ్లు వస్తాయనేది ఈ సినిమాతో ఎక్స్ పీరియన్స్ చేశాను.
ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏమిటి?
ఒక కథకి ఎవరు నిర్మాతగా దొరుకుతారు అని డైరెక్టర్ వెతుకుతారు. కానీ నేను ఇలాంటి కథని ఎవరు డైరెక్ట్ చేస్తారా అని వెతికాను. విపిన్ మంచి రైటర్. నాకు ఇలాంటి ఒక ప్రత్యేకమైన కథ కావాలని చెప్పి రాయించుకున్న కథ ఇది.
హీరో నరేష్ అగస్త్య గురించి?
-ఈ కథ రెడీ అయిన తర్వాత నేను చెప్పిన ఒకే ఒక్క హీరో నరేష్ అగస్త్య. తను అద్భుతమైన పెర్ఫార్మర్. తను ఈ సినిమా కోసం హోంవర్క్ చేశాడు. మ్యూజిక్ టీచర్ ని పెట్టుకుని బేసిక్స్ నేర్చుకున్నాడు.
-ఈ సినిమాకి మంచి మ్యూజిక్, విజువల్స్, పెర్ఫార్మెన్స్, ఆర్ట్ వర్క్ ఉండాలి. అందుకే టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ విషయంలో మేము ఎక్కడ రాజీపడలేదు. ఊటీలో ఇప్పటివరకూ ఎవ్వరు షూట్ చేయని లొకేషన్ లో ఈ సినిమాని సూట్ చేయడం జరిగింది. తప్పకుండా సినిమా చూసిన ఆడియన్స్ ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందుతారు.
భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు?
నాకు రియలిస్టిక్ డ్రామా ఉండే సినిమాలు అంటే ఇష్టం. భవిష్యత్తులో కూడా రియల్ ఎమోషన్స్ ఉండే సినిమాలు తీయాలని వుంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ