
బైకర్ లో పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న ఇంపాక్ట్ఫుల్ క్యారక్టర్ చేశాను – మాళవిక నాయర్
చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మాళవిక నాయర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
బైకర్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
2024 ఏప్రిల్‌లో కథ విన్నాను. చాలా నచ్చింది. దర్శకుడు అభిలాష్ చాలా ఫ్రెష్ కంటెంట్ ఉన్న క్యారెక్టర్ రాశారు. బైకర్ ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్. ఈ సినిమా కోసం చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. ఇది హై అడ్రినలిన్, హై ఆక్టేన్ ఫిల్మ్. మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది.
ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
నా క్యారెక్టర్ గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. ఇందులో నా పాత్ర కథకు బ్రిడ్జ్‌లా ఉంటుంది. ఒక స్పోర్ట్స్‌మన్ జీవితంలో ఫ్యామిలీ రోల్ చాలా కీలకం. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఏ నిర్ణయం అయినా కలిసి తీసుకుంటారు. కథ మూడు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. నా పాత్ర కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న మంచి ఇంపాక్ట్ఫుల్ రోల్ చేశాను.
శర్వా గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
రియల్ లైఫ్‌లో మేమిద్దరం కూడా ఇంట్రోవర్ట్స్. పెద్దగా మాట్లాడుకోము. కానీ సినిమాలో క్యారెక్టర్ల పరంగా మంచి కెమిస్ట్రీ కుదిరింది. శర్వా గారు చాలా స్పాంటేనియస్‌గా ఉంటారు. ప్రమోషన్స్‌లో ఇంకా బాగా ఇంటరాక్ట్ అయ్యాం.
బైకర్‌ను F1తో పోలుస్తున్నారు కదా?
మోటోక్రాస్ స్పోర్ట్‌ను షూట్ చేయడం చాలా కష్టం. మ్యూజిక్ టెక్నికల్‌గా ఖచ్చితంగా మంచి హై ఇస్తుంది. అలాగే ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఫాదర్-సన్ ఎమోషన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ఆర్క్ ఉంటుంది.
ఇందులో డ్యాన్స్ నంబర్స్ ఉన్నాయా?
ఇందులో “ప్రెట్టీ బేబీ” సాంగ్ ఉంది. శేఖర్ మాస్టర్ చాలా బ్యూటిఫుల్‌గా కొరియోగ్రఫీ చేశారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
రాజశేఖర్ గారితో మీకు సీన్స్ ఉన్నాయా?
ఉన్నాయి. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం. అంత సీనియర్ అయినప్పటికీ సెట్లో అందరితో చాలా క్లోజ్‌గా ఉంటారు. మనం ఏదైనా చెబితే వింటారు. అది చాలా గొప్ప గుణం. చాలా కైండ్ పర్సన్.
మ్యూజిక్ గురించి చెప్పండి?
ఈ సినిమాలో మ్యూజిక్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. జిబ్రాన్ గారు నేపథ్య సంగీతం అద్భుతంగా చేశారు. ప్రతి క్యారెక్టర్‌కు గుర్తుపెట్టుకునే సౌండ్‌ట్రాక్స్ కంపోజ్ చేశారు. మ్యూజిక్ పరంగా మంచి హై ఉంటుంది.
డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గురించి?
అభిలాష్ గారు చాలా క్లారిటీతో ఉండే డైరెక్టర్. కథకు, క్యారెక్టర్లకు ఏమి కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అలాగే అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తిచేస్తారు. ఆయన మంచి లీడర్. బైకర్ ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది.
మీరు సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేయడానికి కారణం?
నాకు ప్రతి సారి కొత్త క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. డిఫరెంట్ లేయర్స్ ఉన్న పాత్రలు చేయాలని అనుకుంటాను. అలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తాను.
మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది?
ఒక క్యారెక్టర్ చేసే ముందు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుంటాను. మనం సినిమాలు చేస్తున్నదే వాళ్ల కోసం. అలాగే ఆ క్యారెక్టర్ నాకు పర్సనల్‌గా కనెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటాను. ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తే చేస్తాను. ఇప్పటివరకు నా జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను.
బైకర్ గురించి ఒక పదంలో చెప్పాలంటే?
“థ్రిల్లింగ్.”
సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే సినిమా మంచి స్పూర్తిని ఇస్తుంది. యంగ్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది.
అల్ ది బెస్ట్
థాంక్యూ
