Ramayana Trailer Creates History by Crossing 1 Billion views

‘డీసీ’ వైల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ… సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది – అరుణ్ మాథేశ్వరన్
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డిసి’. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
డిసి కథ ఆలోచన ఎప్పుడు మొదలైంది?
-నేను ఎప్పటినుంచో చెప్పాలనుకున్న కథ ఇది. ఒక పార్టీలో లోకేష్‌ని కలిశాను. ఈ ఆలోచన ఆయనకు చెప్పి, మనిద్దరం కలిసి చేస్తే బాగుంటుందని అన్నాను. ఆయనకు కథ చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇది ఒక గ్యాంగ్‌స్టర్ కథ. తన ప్రయాణంలో చంద్ర, పార్వతిని కలుస్తాడు. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలా సాగుతుంది అనేదే సినిమా.
టైటిల్లో దేవదాస్, చంద్ర, పార్వతి కనిపిస్తున్నారు. కానీ ట్రైలర్లో పూర్తిగా గ్యాంగ్‌స్టర్ కథలా ఉంది. టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
-దేవదాస్, చంద్ర, పార్వతి అనే మూడు పాత్రల కోర్ ఐడియా మాత్రమే దేవదాస్ నుంచి తీసుకున్నాం. కానీ కథ మాత్రం పూర్తిగా కొత్తది. పూర్తిగా డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ. దేవదాస్ అంటే అందరికీ క్లాసిక్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. అదే పాత్రలను గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథను రూపొందించాను.
లోకేష్ కనగరాజ్ చాలా బిజీ డైరెక్టర్. ఆయనను హీరోగా ఎలా ఒప్పించారు?
– లోకేష్ గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్. నేను కథ చెప్పిన వెంటనే ఆయనకు బాగా నచ్చింది. అయితే అప్పటికి ఆయన ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. నేను కూడా ఇళయరాజా బయోపిక్ పనుల్లో ఉన్నాను. నా ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ఆయన కూలీ తర్వాత ఫ్రీ అయ్యారు. అలా ప్రాజెక్ట్ మొదలుపెట్టాం హీరోగా ఇది లోకేష్ గారికి తొలి సినిమా. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఒక దర్శకుడిని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది?
ఇది నాకు కొత్త కాదు. భారతీరాజా, సెల్వరాఘవన్ గారిని డైరెక్ట్ చేశాను. అలాగే ధనుష్ గారు కూడా దర్శకుడే. దర్శకులతో పని చేయడం ఈజీగా ఉంటుంది. వాళ్లకు సినిమా బాగా తెలుసు కాబట్టి, డైరెక్టర్ విజన్ ని త్వరగా అర్థం చేసుకుంటారు.
‘డీసీ’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?
ఇది హోప్ ఇచ్చే సినిమా. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా కొత్త అనుభూతిని ఇస్తుంది.
వామికా గబ్బి పాత్ర గురించి చెప్పండి?
-ఈ సినిమాలో వామికా సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తుంది. దేవదాస్‌ను కలిసిన తర్వాత ఆమె జీవితం ఎలా మారుతుంది అనేదే ఆమె పాత్ర ప్రయాణం. తన పాత్రలో చాలా మంచి ఆర్క్ ఉంటుంది. వామికా కూడా అద్భుతంగా నటించింది.
సన్ పిక్చర్స్ గురించి?
సన్ పిక్చర్స్ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఈ కథను కళానిధి మారన్ గారికి చెప్పినప్పుడు ఆయనకు చాలా నచ్చింది. వారి నిర్మాణంలో సినిమా చేయడం నాకు గౌరవంగా అనిపించింది.
అనిరుధ్ సంగీతం గురించి?
అనిరుధ్‌కు ఈ సినిమా కథ, పాత్రల గురించి పూర్తిగా తెలుసు. నేను ఆయనకు ఒకటే చెప్పాను… ఈ సినిమాకు సంగీతం చాలా వైల్డ్‌గా ఉండాలని. ఆయన దేశంలోనే అత్యుత్తమ సంగీత దర్శకుల్లో ఒకరు. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. అద్భుతమైన సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. ఆయన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఇళయరాజా బయోపిక్ ఎంతవరకు వచ్చింది?
ఆ ప్రాజెక్ట్‌పై పని చేశాం. తప్పకుండా భవిష్యత్తులో ఆ సినిమా మొదలవుతుంది.
తెలుగు హీరోలతో సినిమా చేసే ఆలోచన ఉందా?
ఖచ్చితంగా ఉంది. తెలుగులో చాలా మంది ప్రతిభావంతులైన నటులు ఉన్నారు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో తెలుగు హీరోలతో కూడా సినిమా చేయాలని ఉంది.
సినిమాటోగ్రాఫర్ ముఖేష్ గురించి?
ముఖేష్ నా కాలేజ్ జూనియర్. నాకు ఆయన 26 ఏళ్లుగా తెలుసు. ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. థియేటర్లో ప్రేక్షకులకు విజువల్స్ చాలా మంచి అనుభూతిని ఇస్తాయి.
ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదల కావడం గురించి?
ఏషియన్ సినిమాస్ ద్వారా ‘డిసి’ తెలుగులో విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ. వారి ద్వారా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం గౌరవంగా భావిస్తున్నాను.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ
