మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
Janhvi Kapoor | ఆ సినిమా రద్దుతో జాన్వీకపూర్ తమిళ ఎంట్రీకి బ్రేక్
కథానాయిక జాన్వీకపూర్‌కు దక్షిణాది అంటే ప్రత్యేకమైన అభిమానం. తన తల్లి శ్రీదేవి తరహాలోనే దక్షిణాదిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నది జాన్వీకపూర్ లక్ష్యంగా చెబుతారు. అందుకే ఇటీవలకాలంలో హిందీ చిత్రాలకంటే దక్షిణాదిపైనే దృష్టి పెడుతున్నది.
Janhvi Kapoor | కథానాయిక జాన్వీకపూర్‌కు దక్షిణాది అంటే ప్రత్యేకమైన అభిమానం. తన తల్లి శ్రీదేవి తరహాలోనే దక్షిణాదిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నది జాన్వీకపూర్ లక్ష్యంగా చెబుతారు. అందుకే ఇటీవలకాలంలో హిందీ చిత్రాలకంటే దక్షిణాదిపైనే దృష్టి పెడుతున్నది. తెలుగులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు సంపాదించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది జాన్వీకపూర్. అయితే ఈ అమ్మడి తమిళ ఎంట్రీకి మాత్రం అనూహ్యంగా బ్రేక్ పడింది. వివరాల్లోకి వెళితే.. తమిళంలో సూర్య కథానాయకుడిగా ‘కర్ణ’ పేరుతో భారీ పాన్ ఇండియా పౌరాణిక చిత్రానికి సన్నాహాలు చేశారు.
రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకుడు. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. కొద్ది రోజుల క్రితం ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్లు తెలిసింది. అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చిత్ర బృందం పేర్కొంది. దీంతో జాన్వీకపూర్ తమిళ ఎంట్రీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.