W/O Anirvesh would captivate audiences and achieve success – Allari Naresh
Satyabhama | అప్పుడే ఓటీటీలోకి కాజల్ అగర్వాల్ సత్యభామ.. ఇంతకీ ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Satyabhama | టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇటీవలే సత్యభామ (Satyabhama)గా ప్రేక్షకుల ముందుకొచ్చిందని తెలిసిందే. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించినా.. ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది.
Satyabhama | గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే భామల్లో ఒకరు టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ బ్యూటీ ఇటీవలే సత్యభామ (Satyabhama)గా ప్రేక్షకుల ముందుకొచ్చిందని తెలిసిందే. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీ జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. she safe app ప్రాముఖ్యతను ప్రభావవంతంగా చూపిస్తూ కాజల్ హైఓల్టీజీ పర్ఫార్మెన్స్తో పవర్ఫుల్ కాప్‌గా నయా అవతార్‌లో కనిపించినా సినిమా మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది.
థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించినా.. ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. సత్యభామ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో సినిమాను మిస్సయిన వారు 4 వారాల తర్వాత డిజిటల్ డెబ్యూ ఇచ్చిన సత్యభామను ఓసారి చూసేయండి మరి.
సుమన్ చిక్కాలా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ టిక్కా నిర్మించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్దన్, రవి వర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ ఎడ్మ ఇతర కీలక పాత్రలు పోషించారు.