Pushpa-2: The Rule – Promotional Events in 7 Indian Cities
The Indian film “Pushpa-2: The Rule,” directed by acclaimed director Sukumar and starring Icon Star Allu Arjun, is one of the most highly anticipated films globally. This pan-India project is being produced with grand ambition by Mythri Movie Makers in association with Sukumar Writings. Producers Naveen Yerneni and Yalamanchili Ravi Shankar have planned a massive worldwide release of the film across 12,000 screens on December 5.
In anticipation of its release, “Pushpa-2” has already set new records in advance bookings in the United States. Indian cinema fans, especially followers of Icon Star Allu Arjun, are eagerly awaiting promotional events, which have been officially announced to take place across seven major Indian cities. A video released by the film’s team confirmed that these massive promotional events will be held in Patna, Kolkata, Chennai, Kochi, Bengaluru, mumbai and Hyderabad.
As the film nears completion, with its final stages of shooting and post-production underway, “Pushpa-2: The Rule” is being meticulously crafted to break box office records and create a storm of collections across India. The film stars Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil, Anasuya Bharadwaj, Sunil, and Rao Ramesh in key roles.
ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో ఇండియన్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ మాసివ్ ఈవెంట్స్
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం భారతదేశంలోని సినీ ప్రేమికులు, ఐకాన్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్‌ను ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్ హైదరాబాద్‌లో ఈ మాసివ్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్ షేక్ చేయడానికి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల వండర్ఫుల్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.