Chiranjeevi’s Grand Diwali Bash Attended By Venkatesh, Nagarjuna

Chiranjeevi’s Grand Diwali Bash Attended By Venkatesh, Nagarjuna
This Diwali turned brighter for the Telugu film fraternity as Megastar Chiranjeevi opened the doors of his residence for a grand festive celebration. The highlight of the evening was the presence of Chiranjeevi’s closest industry friends and contemporaries, Victory Venkatesh Daggubati and King Nagarjuna Akkineni. Venkatesh’s wife Neeraja and Nagarjuna’s wife Amala also attended the bash. Nayanthara who is the leading lady in Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu also graced the occasion.
The iconic trio, often regarded as the pillars of Telugu cinema, came together once again, delighting fans who grew up watching their legendary films. Their easy banter and cheerful moments served as a reminder that while cinematic eras evolve, true friendships remain evergreen.
Chiranjeevi’s residence shimmered with festive elegance. Members of the Mega family also graced the event, adding to the joyous family atmosphere. The celebration blended the richness of tradition with the glitz of stardom, embodying the spirit of Diwali — joy, togetherness, and light overpowering darkness.
“Very delighted to have celebrated the Festival of Lights with my dear friends, @iamnagarjuna, @VenkyMama and my co-star #Nayanthara, along with our families
Moments like these fill the heart with joy and remind us of the love, laughter, and togetherness that make life truly bright ,” wrote Chiranjeevi on his X account.
Photos from the star-studded gathering shared by Chiranjeevi are going viral across social media platforms in no time. Fans couldn’t contain their excitement seeing Chiranjeevi, Venkatesh, and Nagarjuna share a frame once again.
Even as they continue to rule hearts individually, their off-screen bond stands as a beautiful reminder that beyond the reels and rivalries, these stalwarts share respect, affection, and an enduring friendship that defines the essence of Tollywood’s golden generation.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు- వేడుకకు హాజరైన విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆయన స్నేహితులు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, కింగ్ నాగార్జున అక్కినేని హాజరయ్యారు. వెంకటేష్ భార్య నీరజ, నాగార్జున భార్య అమల కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలోని హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు.
ఈ ముగ్గురు ఐకానిక్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. కాలం మారినా, తరాలు మారినా, వీరి స్నేహం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందనే భావనను ఈ వేడుక మరోసారి గుర్తుచేసింది.
చిరంజీవి నివాసం పండుగ శోభతో మెరిసిపోయింది. మెగా కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందాన్ని రెట్టింపు చేశారు.
“నా డియర్ ఫ్రెండ్స్ @iamnagarjuna, @VenkyMama, నా సహనటి #Nayantharaతో కలిసి దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకున్నాను
ఇలాంటి క్షణాలే మన హృదయాలను సంతోషంతో నింపుతాయి. ప్రేమ, నవ్వులు, ఐక్యత..ఇవే జీవితం నిజంగా వెలుగొందే మూలాలు ” అని చిరంజీవి తన ఎక్స్ (X) అకౌంట్ పోస్ట్ చేశారు.
చిరంజీవి పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు ఐకానిక్ స్టార్స్ కలిసి కనిపించడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.