Appudo Ippudo Eppudo racy and entertaining teaser unveiled
Nikhil, who gained nationwide popularity with Karthikeya 2, is all set to impress with his upcoming film titled “Appudo Ippudo Eppudo.” The film is directed by blockbuster director Sudheer Varma, known for his variety of films. This interesting combo previously collaborated on blockbuster films Swamy Rara and Keshava. The prominent production house Sri Venkateswara Cine Chitra LLP is producing this project. It is being bankrolled by senior and uncompromising producer BVSN Prasad
Recently released first look impressed everyone and today, makers dropped the teaser as Dussehra treat. The teaser introduces Rishi, portrayed by Nikhil, who is a racer and a thief. Rishi instantly falls in love with Rukmini Vasanth. Their delightful chemistry and the unfolding love story spark curiosity. As the plot unfolds, it reveals Divyansha Kaushik as another of Rishi’s love interest, after which the teaser transitions into an action mode.
With intense chases and an exhilarating score, it builds significant anticipation for this action-packed film. Titled “Appudo Ippudo Eppudo,” it is set to release worldwide on November 8th as a Diwali treat, offering a blend of thrills, humor, and a light-hearted romance. The last dialogue definitely connects to all the men. Packed with massive action, fun and racy moments, the teaser promises an exhilarating experience in cinema halls. The collaboration between Nikhil and director Sudheer Varma aims for a hat-trick blockbuster.
Kannada actress Rukmini Vasanth, who has gained solid popularity, is making her Telugu debut with this film. Yogesh Sudhakara, Sunil Shah, and Raja Subramaniam are co-producing the film. Bapineedu B is presenting this prestigious project. Singer Karthik is composing the songs, while Sunny MR is handling the background score. Richard Prasad is in charge of cinematography, and Navin Nooli is handling the editing. Appudo Ippudo Eppudo is set for a grand release on November 8th.
నిఖిల్ సిద్ధార్థ్, సుధీర్ వర్మ, ఎస్.వి.సి.సి ప్రొడక్షన్స్ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ విడుదల.. నవంబర్ 8న సినిమా గ్రాండ్ రిలీజ్
కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నిఖిల్ రిషి అనే పాత్రలో కనిపించనున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. తనకు, హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు మధ్య లవ్ ట్రాక్, వారి మధ్య కెమిస్ట్రీ చక్కగా ఉంది. అలాగే ఇద్దరి మధ్యలో తెలియని మరో సీక్రెట్ లవ్ స్టోరీ ఏదో ఉందనే క్యూరియాసిటీ కూడా కలుగుతోంది. అదే హీరోయిన్ దివ్యాంశ కౌశిక్. అసలు వీరి ముగ్గురు మధ్య లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. అలాగే టీజర్‌లోని యాక్షన్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా ఆకట్టుకంటున్నాయి.
గూజ్ బమ్స్ తెప్పించే చేజింగ్ సన్నివేశాలు, కథలోని కీలక మలుపులు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని రివీల్ చేస్తోంది. దీపావళి సందర్భంగా సినిమాను నవంబర్ 8న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, చక్కటి కామెడీ, రొమాన్స్ సహా అన్నీ అంశాలతో సినిమా రూపొందింది. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. ఈసారి నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పక్కా అని తెలుస్తుంది.
కన్నడ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులర్ హీరోయిన్గా అందరినీ అలరిస్తోన్న రుక్మిణి వసంత్ .. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తోంది. హర్ష చెముడు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్. బాపినీడు.బి ఈ చిత్రానికి సమర్పణ. సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 8న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.