‘సర్దార్ 2’ కోసం కార్తి తో రొమాన్స్ చేయనున్న ఆషికా రంగనాథ్
హీరో కార్తి ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో స్టార్ట్ అయ్యింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహన్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.
తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘సర్దార్ 2’ లో డాజ్లింగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో ఫిమేల్ లీడ్ గా కనిపించనున్నారు. ఆషికా రంగనాథ్ కు బర్త్ డే విషెస్ అందించిన మేకర్స్ ప్రాజెక్ట్ లోకి స్వాగతం పలికారు.
సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.
సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్.
విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తారాగణం: కార్తి, ఎస్ జె సూర్య, మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: పిఎస్ మిత్రన్
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
సహ నిర్మాత: ఎ వెంకటేష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
డీవోపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నంబియార్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పాండి
పీఆర్వో: వంశీ-శేఖర్