ఇరుముడి కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి

Trailer Of Ramba Oorvasi Menaka Unveiled
Allari Naresh is back in a space that has long been synonymous with his brand of entertainment with his upcoming fantasy comedy Ramba Oorvasi Menaka. Directed by Chandra Mohan Chintada and produced by Razesh Danda and Nimmakayala Prasad under Annapurna Studios and Hasya Movies, Ramba Oorvasi Menaka is set for a grand worldwide theatrical release on September 4. The film promises a quirky mix of mythology, rural humour and whimsical fun, with the trailer unveiled by King Nagarjuna offering a glimpse into its unusual world.
Ramba, Oorvashi and Menaka descend into Bhulokam after years of prayers from the protagonist, Suri. However, the three celestial beauties arrive without their divine powers, turning their presence into a major problem for him. With a series of unexpected challenges piling up, Suri remains determined to face everything thrown his way by Lord Indra. Matters get even more chaotic with his girlfriend scolding him over the three apsaras living in his house, the police questioning him, and his mother fighting for her life in the hospital.
Director Chandra Mohan Chintada narrated the story in most entertaining manner. The comedy between Allari Naresh and Naresh VK stands out as one of the most entertaining aspects of the trailer. The popular social media phrase “Love You Bacches” is used effectively for a hilarious moment, while the fun take on OG’s Japanese dialogue delivers a laugh-out-loud ending to the trailer.
Allari Naresh is undoubtedly the biggest highlight of the trailer, with his impeccable comic timing, energetic performance, and effortless delivery making every scene more entertaining. He appears completely in his element, bringing the right mix of innocence, and humour to his character. Surabhi plays the female lead, while Vennela Kishore adds to the fun with his lively portrayal of Indra. Naresh VK is equally entertaining in a hilarious role, sharing some of the funniest moments with Naresh. Rashi Singh, Vishnupriya, and Prisha Singh portray the three celestial beauties and look apt in their respective roles.
Raam Reddy’s cinematography ads liveliness, while Brahma Kadali’s production design enhances the fantasy portions. Chaitan Bharadwaj’s energetic music further complements the fun-filled mood, with Chota K Prasad taking care of the editing.
If the trailer is any indication, the film is shaping up as a colourful and unconventional fantasy comedy, with Allari Naresh once again returning to the genre where his comic strengths are at their best.
Cast: Allari Naresh, Surabhi, Rashi Singh, Vishnupriya, Prisha Singh, Vennela Kishore, Naresh VK, Srinivas Reddy, Racha Ravi, Muralidhar Goud
Technical Crew:
Director: Chandra Mohan Chintada
Producers: Razesh Danda, Nimmakayala Prasad
Banners: Annapurna Studios & Hasya Movies
Music: Chaitan Bharadwaj
DoP: Raam Reddy
Art Director: Brahma Kadali
Editor: Chota K Prasad
PRO: Vamsi-Shekar
కింగ్ నాగార్జున లాంచ్ చేసిన అల్లరి నరేష్, చంద్ర మోహన్ చింతాడ, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ ‘రంభ ఊర్వశి మేనక’ హిలేరియస్ ట్రైలర్
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. పౌరాణిక కథలు, గ్రామీణ హాస్యం, వినోదాత్మకమైన అంశాలతో అలరించనుంది. కింగ్ నాగార్జున ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.
సూరి(అల్లరి నరేష్) మొక్కుబడులతో భూలోకానికి దిగివచ్చిన రంభ, ఊర్వశి, మేనకలు.. తమ దివ్య శక్తులను కోల్పోవడంతో అసలు కథ మొదలవుతుంది. ముగ్గురు అప్సరసలు తన ఇంట్లో ఉండటంతో సూరికి ఎదురయ్యే ఇబ్బందులు, అతడి ప్రేయసి గొడవ, పోలీసుల విచారణ, మరోవైపు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తల్లి.. ఇలా వరుస సమస్యలతో కథలో ఎంటర్టైమెంట్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
ట్రైలర్‌ను దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ ఆద్యంతం ఎంటర్టైనింగ్గా నడిపించారు. ముఖ్యంగా అల్లరి నరేష్, నరేష్ వీకే మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘లవ్ యూ బచ్చెస్’ డైలాగ్‌ను కూడా ఫన్నీగా ఉపయోగించారు. ‘ఓజీ’లోని జపనీస్ డైలాగ్‌ను సరదాగా వాడిన విధానం ట్రైలర్‌కు మంచి కామెడీ ఎండింగ్ ఇచ్చింది.
ట్రైలర్లో అల్లరి నరేష్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. అమాయకత్వం, ఎనర్జీ, కామెడీ కలగలిపిన ఆయన పాత్ర సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సురభి కథానాయికగా నటించగా, వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో నవ్వులు పూయించారు. నరేష్ వీకే కూడా అల్లరి నరేష్‌తో కలిసి వచ్చే సన్నివేశాల్లో మెప్పించారు. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ముగ్గురు అప్సరసలుగా అలరించారు.
రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చిత్రానికి కలర్‌ఫుల్ లుక్ తీసుకొచ్చింది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ ఫాంటసీ ప్రపంచాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దగా, చైతన్ భరద్వాజ్ సంగీతం ట్రైలర్‌లోని ఎంటర్టైన్మెంట్ మూడ్‌కు ఎలివేట్ చేసింది.
ట్రైలర్ చూస్తుంటే ‘రంభ ఊర్వశి మేనక’ పల్లెటూరి హ్యూమర్, పురాణ నేపథ్యం, ఫాంటసీ అంశాలను కలిపిన ఒక డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించింది. ముఖ్యంగా కామెడీ జానర్లో అల్లరి నరేష్ బలాన్ని మరోసారి పూర్తిగా ఉపయోగించుకున్న సినిమాగా అలరించబోతుంది.
తారాగణం: అల్లరి నరేష్, సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ
నిర్మాతలు: రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్
బ్యానర్లు: అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్
సంగీతం: చైతన్ భరద్వాజ్
డిఓపి: రాంరెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
పీఆర్వో: వంశీ-శేఖర్
