
SD15 Team Congratulates Hero Satyadev on Winning His First SIIMA Award for Kingdom
The team of SD15 has congratulated young and talented actor Satyadev on winning the SIIMA Award for Best Supporting Actor at the recently held SIIMA Awards. This marks Satyadev’s first-ever SIIMA Award, which he received for his impressive performance in Kingdom.
Satyadev earned widespread appreciation for portraying the character Shiva, the brother of Vijay Deverakonda’s character in Kingdom. His performance was one of the film’s major highlights and won the hearts of audiences.
Currently, Satyadev is busy shooting for his landmark 15th film, tentatively titled SD15. The film is being produced by B. Narendra Reddy under the Trishul Visionary Studios banner and directed by Lakshminarayana Puttanchetti, who has crafted it as a complete entertainer.
Faria Abdullah plays the female lead in SD15. The makers say the film will showcase a completely new side of Satyadev as an actor and present him in a never-seen-before role on the big screen.
“కింగ్డమ్” సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్ అందుకున్న హీరో సత్యదేవ్ కు శుభాకాంక్షలు తెలిపిన “ఎస్ డి 15” టీమ్
యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నారు. ఇది ఆయనకు ఫస్ట్ సైమా అవార్డ్. కింగ్డమ్ సినిమాలో నటనకు గానూ సత్యదేవ్ ను ఈ అవార్డ్ వరించింది. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది “ఎస్ డి 15” మూవీ టీమ్. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ 15వ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. కింగ్డమ్ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ సోదరుడిగా శివ పాత్రలో సత్యదేవ్ నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
“ఎస్ డి 15” సినిమాను త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. ఈ సినిమా నటుడిగా సత్యదేవ్ లోని కొత్త కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోంది.
