Rocking Star Manchu Manoj Launches New Music Label Mohana Raaga

Rocking Star Manchu Manoj Launches New Music Label Mohana Raaga
Rocking Star Manchu Manoj has officially launched his brand-new music label, “Mohana Raaga.” With the tagline “Local Hearts, Global Beat,” Manoj aims to take authentic Indian music to a worldwide audience through this new venture. He made the announcement today via social media.
Manoj shared that his deep love for music is what inspired him to create this label. Through Mohana Raaga, he plans to introduce fresh sounds, bold talent, and fearless creativity to the music world, giving artists a new space to express themselves.
Fans and netizens have been showering him with wishes and congratulations across social media, celebrating this exciting new chapter in his artistic journey.
“మోహన రాగ” మ్యూజిక్ లేబుల్ ప్రారంభించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన కొత్త మ్యూజిక్ లేబుల్ “మోహన రాగ” ప్రారంభించారు. లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్ అనే క్యాప్షన్ తో మన సంగీతాన్ని వరల్డ్ వైడ్ రీచ్ చేసేందుకు మోహన రాగ మ్యూజిక్ లేబుల్ తో తనదైన ప్రయత్నం చేయబోతున్నారు మంచు మనోజ్. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా మంచు మనోజ్ ఈ ప్రకటన చేశారు.
సంగీతం మీద తనకున్న ప్రేమే మోహన రాగ మ్యూజిక్ లేబుల్ స్థాపించేలా స్ఫూర్తినిచ్చిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫ్రెష్ సౌండ్స్, బోల్డ్ టాలెంట్, ఫియర్ లెస్ క్రియేటివిటీ తమ మ్యూజిక్ లేబుల్ ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తామని మంచు మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
