RAPO22 – Ram Pothineni and Bhagyashri Borse Shine In New Year Special Poster
Firstly, wishing a very happy New Year to all the patrons. On this joyous occasion, the makers of Ram Pothineni and director Mahesh Babu P’s RAPO22 have unveiled a new poster of the film. The film is being produced by Naveen Yerneni and Y Ravi Shankar under Mythri Movie Makers banner.
Coming to the poster, it introduces Bhagyashri Borse, the female lead in the film. Her character is named Mahalaxmi and the same is communicated through this special poster. We also get a cherishing glimpse of Ram, who appears to be playing a college boy in the film.
The first thing that catches our attention after seeing the poster, is the sparkling chemistry between Ram and Bhagyashri. Ram looks fresh and lively in the poster while we also get to indulge in the aesthetic facial features of Bhagyashri.
This poster is, in a way, the extension of the earlier poster that featured Ram and introduced him as Sagar. We get an instant nostalgia kick while watching this promotional material from RAPO22. Director Mahesh Babu is making sure that there is a vintage touch to all the material that is being released.
As per the latest updates, the first schedule of the film has been completed already, and the stage is being prepared for the upcoming schedule. Mythri Movie Makers are producing the film on a big canvas.
Naveen Yerneni and Ravi Shankar are producing the film while the music is composed by Vivek-Mervin duo. Avinash Kolla is the production designer while Sreekar Prasad is the editor. Madhu Neelakandan is operating the camera. Cherry is running the excutive operations at CEO capacity.
రామ్ పోతినేని – మహేష్ బాబు పి – మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలో మహాలక్ష్మిగా హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
‘మన సాగర్ గాడి లవ్వు… మహా లక్ష్మి’ అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ చూస్తే… చుడీదార్ ధరించి ట్రెడిషనల్ లుక్కులో బావున్నారు. ఆవిడ కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ అయితే ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.
”హైదరాబాద్లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తీశాం. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, ఆయన నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ అని చెప్పాలి. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారు. ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని అందరూ చెబుతున్నారు. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి” అని దర్శక నిర్మాతలు తెలిపారు.
RAPO 22లో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’ అంటూ ఇటీవల రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేశారు. పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు… ఆ లుక్ చూడగానే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోందని ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఒక్క లుక్ ద్వారా సినిమాపై అంచనాలు పెంచారు దర్శకుడు మహేష్ బాబు పి.
రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, మ్యూజిక్: వివేక్ – మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, కథ – కథనం – దర్శకత్వం: మహేష్ బాబు పి.