
Raju Weds Rambai Trailer – Promises a Pure, Native & Emotional Village Love Story
Akhil and Tejaswini Rao star as the lead pair in Raju Weds Rambai, a heartfelt rural love story presented by ETV Win Originals Production. The film is produced by Venu Udugula and Rahul Mopidevi under Dolamukhi Subaltern Films and Monsoons Tales, with Dr. Nageswara Rao Pujari presenting the project. Sailu Kompati directs this emotional drama.
Raju Weds Rambai will be released in theatres on November 21st through Vamsi Nandipati Entertainments and Bunny Vas Works, headed by Vamsi Nandipati and Bunny Vas.
The trailer, unveiled today, showcases a refreshing and authentic love story set in a picturesque village backdrop. Raju, a village band player, falls deeply in love with Rambai, an innocent and beautiful girl. The trailer explores how their efforts to get married lead to unexpected consequences.
Caught between a father who despises love and a lover who cannot live without her, Rambai’s emotional struggle is portrayed with depth. Whether Raju and Rambai’s pure love survives until marriage, and what destiny awaits them forms the core of the film’s journey.
Akhil Uddeamari and Tejaswini Rao deliver convincing performances, while Chaitu Jonnalagadda stands out as the strict father who refuses to accept his daughter’s love. The trailer promises a native, emotional love story rooted in Telangana’s rural soul.
Cast
Akhil Uddeamari, Tejaswini Rao, Shivaji Raja, Chaitu Jonnalagadda, Anita Chowdary, Kavitha Srirangam, and others.
Technical Crew
Costume Designers: Priyanka Veeraboyina, Aarthi Vinnakota
Sound Design: Pradeep G.
Publicity Designer: Dhani Aele
Production Design: Gandhi Nadikudikar
Executive Producer: Dhana Gopi
Cinematography: Wajid Baig
Music: Suresh Bobbili
Editing: Naresh Adupaa
Co-Producers: Dolamukhi Subaltern Films, Monsoons Tales
Producers: Venu Udugula, Rahul Mopidevi
Writer & Director: Sailu Kompati
Production: ETV Win Originals Production
Theatrical Release: Vamsi Nandipati (Vamsi Nandipati Entertainments), Bunny Vas (Bunny Vas Works)
PRO: GSK Media (Suresh – Srinivas)
ఫ్యూర్ నేటివ్, ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంటున్న “రాజు వెడ్స్ రాంబాయి” ట్రైలర్, ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు.
ఈ రోజు “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆహ్లాదకరమైన పల్లెటూరిలో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ఊరిలో బ్యాండ్ కొట్టే రాజు, అందమైన అమ్మాయి రాంబాయిని చూసి ప్రేమిస్తాడు. పిల్లల్ని కంటే పెళ్లి చేస్తారని ఈ ప్రేమ జంట చేసిన ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు. ప్రేమను ద్వేషించే తండ్రి, తనను వదిలి ఉండలేని ప్రేమికుడి మధ్య రాంబాయి ఎలాంటి వ్యధకు గురయ్యింది అనేది భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. ప్రాణంగా ప్రేమించుకున్న రాజు, రాంబాయి ప్రేమ కథ పెళ్లి వరకు వెళ్లిందా, ఎలాంటి ముగింపునకు చేరుకుంది అనేది సినిమాలో చూడాలి. రాజు పాత్రలో అఖిల్ ఉడ్డెమారి, రాంబాయిగా తేజస్వినీ జీవించారు. కూతురి ప్రేమను ఒప్పుకోని తండ్రిగా చైతు జొన్నలగడ్డ ఫెరోషియస్ గా పర్ ఫార్మ్ చేశారు. ఫ్యూర్ నేటివ్, ఎమోషనల్ లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడబోతున్నట్లు “రాజు వెడ్స్ రాంబాయి” ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.
నటీనటులు – అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు
టెక్నికల్ టీమ్
————————
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
సౌండ్ డిజైన్ – ప్రదీప్.జి.
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే
ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధన గోపి
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ – నరేష్ అడుపా
కో ప్రొడ్యూసర్స్ – ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
రచన, డైరెక్షన్ – సాయిలు కంపాటి
ప్రొడక్షన్ – ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
థియేట్రికల్ రిలీజ్ – వంశీ నందిపాటి(వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్)
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
