
Rajesh Kallepalli Joins Hands with SVF for the Release of OG in Uttarandhra
The buzz around Power Star Pawan Kalyan’s much-awaited action drama OG continues to grow louder. Directed by Sujeeth and produced by DVV Entertainment, the film is set for a grand worldwide release on September 25, 2025, with special paid premieres scheduled on September 24th at 10 PM.
In a significant development, ardent Pawan Kalyan admirer Rajesh Kallepalli has joined forces with Dil Raju’s SVF (Sri Venkateswara Films) to present OG in the Uttarandhra region. This collaboration reflects the passion of Pawan Kalyan fans and ensures a massive theatrical experience for audiences.
Based in Dallas, USA, Rajesh Kallepalli is an accomplished entrepreneur, philanthropist, and community leader. His ventures span IT consulting, restaurants, real estate, movie production, distribution, and live concerts. Under his banner Charisma Dreams, he successfully organized Ram Charan’s Game Changer pre-release event at the Curtis Culwell Center in Garland, Texas, on December 21, 2024—a milestone celebration for Telugu cinema overseas.
Rajesh has also made his mark in film production as the co-producer of the Telugu film Raju Yadav. The movie earned recognition at the Gaddar Telangana Film Awards 2024, where it received two accolades, including a Special Jury Award for producers Rajesh Kallepalli—a testament to his commitment to quality cinema.
Born in Katravullapalli village near Kakinada and raised in Hyderabad, Rajesh pursued dual master’s degrees in the U.S. and has always balanced entrepreneurial success with philanthropy. His initiatives include funding children’s heart surgeries, installing water plants in schools, organizing Annadanam programs, supporting temple development, and donating to nonprofits in India and the U.S.
With his involvement in OG, Rajesh Kallepalli combines his vision, leadership, and passion for cinema to ensure a blockbuster release in Uttarandhra.
Paid Premieres: September 24, 10 PM Worldwide Release: September 25, 2025
శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌తో కలిసి ఉత్తరాంధ్రలో OGని విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా OG (‘ఓజీ’). DVV ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు స్పెషల్ పెయిడ్ ప్రీమియర్లు కూడా పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్పెషల్ ప్రీమియర్లు, డే వన్‌కు సంబంధించిన టికెట్లు అన్నీ కూడా అమ్ముడుపోయాయి. ఈ లెక్కన ఓజీ మొదటి రోజు రికార్డుల్ని క్రియేట్ చేయడం ఫిక్స్ అని అర్థం అవుతోంది.
పవన్ కళ్యాణ్‌కు వీర అభిమాని అయిన రాజేష్ కల్లెపల్లి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ‘ఓజీ’ని రిలీజ్ చేసేందుకు దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ సంస్థ SVF (శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్)తో చేతులు కలిపారు. దీంతో మంచి రిలీజ్ వస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలోని డల్లాస్‌లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్త, కమ్యూనిటీ లీడర్, దాత అయిన రాజేష్ కల్లెపల్లి ఐటీ కన్సల్టింగ్, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణం, పంపిణీ, లైవ్ కాన్సర్ట్‌లను నిర్వహిస్తుంటారు. చరిష్మా డ్రీమ్స్ బ్యానర్ మీద డిసెంబర్ 21, 2024న టెక్సాస్‌లోని గార్లాండ్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అది విదేశాలలో తెలుగు సినిమాకు ఒక మైలురాయి వేడుకగా నిలిచిన సంగతి తెలిసిందే.
‘రాజు యాదవ్’ చిత్రానికి సహ నిర్మాతగా నిర్మాణంలో కూడా రాజేష్ తనదైన ముద్ర వేశారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ‘రాజు యాదవ్’కు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. రాజేష్ కల్లెపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. నాణ్యమైన సినిమా పట్ల ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం.
రాజేష్ కల్లెపల్లి కాకినాడ సమీపంలోని కాట్రావుళ్లపల్లి గ్రామంలో పుట్టారు. హైదరాబాద్‌లో పెరిగిన రాజేష్ అమెరికాలో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. వ్యాపారాలు, దాతృత్వంలో ముందుంటారు. పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడం, పాఠశాలల్లో నీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించడం, ఆలయ అభివృద్ధికి మద్దతు ఇవ్వడం, భారతదేశం, యుఎస్‌లోని లాభాపేక్షలేని సంస్థలకు విరాళం ఇవ్వడం వంటి మంచి పనులు చేస్తుంటారు.
రాజేష్ కల్లెపల్లి తన దృష్టి, నాయకత్వం, సినిమా పట్ల మక్కువను కలిపి ఉత్తరాంధ్రలో OG గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 24, రాత్రి 10 గంటలకు ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 25, 2025న ‘ఓజీ’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు.