Raja Saab | రాగాల వేటలో రాజాసాబ్.. మెరీనా బీచ్లో పాటలకు బాణీలు కడుతున్న తమన్
దేశం మొత్తం ప్రస్తుతం ‘కల్కి 2898ఏడీ’ ఫీవర్తో ఉంది. ఎక్కడ విన్నా ‘కల్కి’ టాపిక్కే. వాతావరణం చూస్తుంటే ప్రభాస్ భారీ విజయాన్నే సొంతం చేసుకున్నట్టు కనిపిస్తున్నది. దీని ప్రభావం ప్రభాస్ తర్వాత సినిమాపై కచ్చితంగా ఉంటుంది. ‘కల్కి 2898 ఏడీ’ తర్వాత వచ్చే ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’. దర్శకుడు మారుతీకి ఇది నిజంగా అగ్నిపరీక్షే.
Raja Saab | దేశం మొత్తం ప్రస్తుతం ‘కల్కి 2898ఏడీ’ ఫీవర్తో ఉంది. ఎక్కడ విన్నా ‘కల్కి’ టాపిక్కే. వాతావరణం చూస్తుంటే ప్రభాస్ భారీ విజయాన్నే సొంతం చేసుకున్నట్టు కనిపిస్తున్నది. దీని ప్రభావం ప్రభాస్ తర్వాత సినిమాపై కచ్చితంగా ఉంటుంది. ‘కల్కి 2898 ఏడీ’ తర్వాత వచ్చే ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’. దర్శకుడు మారుతీకి ఇది నిజంగా అగ్నిపరీక్షే. కానీ.. మారుతీ కూల్గా చెన్నయ్ మెరీనా బీచ్లో సంగీత దర్శకుడు తమన్తో కలిసి ‘రాజాసాబ్’ బాణీల కూర్పులో తలమునకలై ఉన్నారు. ఇందులో మొత్తం అయిదు పాటలు ఉండగా, ఇప్పటికే మూడు పాటలకు ట్యూన్స్ ఇచ్చేశాడు తమన్. ఇంకా రెండు పాటలే మిగిలివున్నాయి
ప్రస్తుతం ఆ ట్యూన్స్ రాబట్టే పనిలో ఉన్నారు తమన్, మారుతి. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత వందలకోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న ప్రభాస్.. కాస్త విరామం తర్వాత పూర్తిస్థాయి తెలుగు హారర్ కామెడీతో ‘రాజాసాబ్’ చేస్తున్నారు. ఈ సినిమాను తొలుత వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ.. ఇంకా తీయాల్సిన షూటింగ్ చాలా ఉండటంతో వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.