Raayan | కౌంట్ డౌన్ షురూ.. రాయన్ ప్రమోషన్స్‌లో ధనుష్ టీం
Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో టైటిల్ రోల్లో నటిస్తోన్న రాయన్ (Raayan). నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Raayan | బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్తో అభిమానులను ఖుషీ చేస్తున్న స్టార్ యాక్టర్లలో ఒకరు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా స్వీయ దర్శకత్వంలో ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రాయన్ (Raayan). నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో బుధవారం ఎస్జే సూర్య, హీరో ధనుష్ పోరుకు సై అంటోన్న స్టన్నింగ్ లుక్ విడుదల చేశారు మేకర్స్. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాయన్ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్తోపాటు ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను జులైలో నిర్వహించనున్నారు మేకర్స్. రానున్న రోజుల్లో మరిన్ని ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్లతో అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ధనుష్
ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. డీ50వ (D50)గా తెరకెక్కుతున్న రాయన్ నుంచి షేర్ రషెస్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనుంది. రాయన్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.ధనుష్ మరోవైపు శేఖర్ కమ్మల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తుండగా.. షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
ప్రమోషన్స్‌లో ధనుష్ టీం..