
Prime Video Sets May 22 as the Worldwide Premiere Date for System
Prime Video has officially announced May 22 as the worldwide premiere date for its upcoming Prime Original film System, a gripping courtroom thriller that dives deep into the clash between power and justice. Directed by Ashwiny Iyer Tiwari and produced by Harman Baweja, Pammi Baweja, and Smitha Baliga under Baweja Studios, the film promises an intense narrative that questions privilege, truth, and the true meaning of justice. The film will stream globally across 240+ countries and territories.
System features powerful performances from Sonakshi Sinha, Jyotika, and Ashutosh Gowariker in lead roles, supported by a strong ensemble cast including Preeti Agarwal, Adinath Kothare, Aashriya Mishra, Gaurav Pandey, and Sayandeep Gupta. The story follows Neha Rajvansh, a privileged public prosecutor, and Sarika Rawat, a humble stenographer, whose unlikely alliance leads them to uncover buried injustices—challenging the very system they operate in.
Written by Harman Baweja, Arun Sukumar, Ashwiny Iyer Tiwari, Tasneem Lokhandwala, and Akshat Ghildial, the film blends emotional depth with legal drama, delivering a thought-provoking cinematic experience. With themes of ambition, ethics, and truth at its core, System is set to engage audiences with its layered storytelling and compelling performances when it premieres exclusively on Prime Video this May 22.
అధికారం, న్యాయం మధ్య పోరాటాన్ని అన్వేషించే హై స్టేక్స్ కోర్ట్ రూం థ్రిల్లర్ సిస్టం.. మే 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్
ఇండియాలో కోర్ట్ రూం డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. కోర్ట్‌రూం థ్రిల్లర్లను ఇష్టపడే ఆడియెన్స్ ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఇక అమెజాన్ ప్రైమ్‌లో మే 22 నుంచి ఓ అద్భుతమైన కోర్ట్ రూం థ్రిల్లర్ ‘సిస్టం’ స్ట్రీమింగ్ కాబోతోంది. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో బావేజా స్టూడియోస్ బ్యానర్‌పై హర్మన్ బావేజా, పమ్మి బావేజా, స్మిత బలిగా నిర్మాతలుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ప్రత్యేక హక్కులు, సత్యం, న్యాయం నిజమైన అర్థాన్ని ప్రశ్నించే తీవ్రమైన కథనంతో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ప్రసారం కానుంది.
‘సిస్టం’ చిత్రంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలలో అద్భుతమైన నటనను కనబరిచారు. అంతే కాకుండా ప్రీతి అగర్వాల్, ఆదినాథ్ కొఠారే, ఆశ్రియా మిశ్రా, గౌరవ్ పాండే, సయన్దీప్ గుప్తా తదితరులు ఇతర పాత్రలను పోషించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేహా రాజవంశ్, నిరాడంబరమైన స్టెనోగ్రాఫర్ సారిక రావత్‌ల మధ్య జరిగే సంభాషణలు, వారి ఊహించని స్నేహం, వారు పనిచేస్తున్న వ్యవస్థనే సవాలు చేస్తూ, అణచివేయబడిన అన్యాయాలను వెలికితీయడానికి దారితీస్తుంది.
హర్మన్ బావేజా, అరుణ్ సుకుమార్, అశ్విని అయ్యర్ తివారీ, తస్నీమ్ లోఖండ్వాలా, అక్షత్ గిల్డియాల్ రచించిన ఈ చిత్రం ఎమోషనల్‌గా సాగుతూనే, న్యాయపరమైన నాటకంతో మేళవించి, ఆలోచింపజేసేలా ఉంటుంది. ఆశయం, నైతికత, సత్యం వంటి ఇతివృత్తాలను ప్రధానంగా కలిగిన ‘సిస్టం’ మే 22న ప్రైమ్ వీడియో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి.
