
Piracy Is Severely Hurting Small Producers – Bunny Vas
Producer and distributor Bunny Vas, known for backing several successful films, recently distributed Raju Weds Rambai and tasted success once again. Speaking on the occasion, he addressed the issues of ticket price hikes and piracy, expressing strong concern over the growing support for notorious piracy platforms like Ibomma by some viewers on social media.
Commenting on the trend, Bunny Vas said, “Piracy is wrong. Justifying it because you personally benefit from it is completely unacceptable.” He further explained that ticket rates are increased only for 10 to 15 big films a year, yet piracy affects every film, not just the big ones.
He emphasized that many small producers invest their entire savings, sometimes even sell their assets to make films, and piracy pushes them into heavy losses. “Producers may appear strong from the outside, but behind the scenes, they go through immense struggles,” he added, urging viewers to support cinema the right way.
పైరసీ వల్ల చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు – నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్
నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తున్నారు బన్నీ వాస్. ఆయన తాజాగా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్బంగా టికెట్ రేట్స్ పెంపు, పైరసీపై ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని కొందరు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్న విషయంపై బన్నీ వాస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ – పైరసీ తప్పు. అలాంటి తప్పును తమకు లాభం కలిగిందని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్. ఏడాదిలో పదో పదిహేనే సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా అన్ని చిత్రాలు పైరసీకి గురవుతున్నాయి. ఆస్తులు అమ్మి సినిమాలు చేస్తున్న ఎంతోమంది చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. పైకి నిర్మాతలు బాగానే కనిపిస్తున్నా, వెనక వారికి బాధలెన్నో ఉంటాయి. అన్నారు.
