Sumanth Prabhas Birthday Special Poster Released from Romanchakam

Nenu Ready to Release in theaters for this summer
హవిష్, త్రినాధ రావు నక్కిన, నిఖిల కొనేరు, హర్నిక్స్ ఇండియా LLP ‘నేను రెడీ’ సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్
యంగ్ హీరో హవిష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కినతో కలసి కంప్లీట్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’ చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
పోస్టర్లు, టైటిల్, టీజర్ గ్లింప్స్ తో ఇప్పటికే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా డైరెక్టర్ త్రినాథరావు” నేను రెడీ ” ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
మేకర్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ లో హవిష్, కావ్య థాపర్ చిరునవ్వులతో కనిపించడం ఆకట్టుకుంది.
ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జిటివి గణేష్, రోహిణి, హరితేజ వంటి ప్రముఖ తారాగణం ప్రేక్షకులకు నవ్వులు పూయించేందుకు రెడీ అయ్యారు.
స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు స్వరాలను అందించారు. నిజార్ షఫీ డీవోపీగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.
నటీనటులు: హవీష్, కావ్య థాపర్, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మి, జయవాణి, మాణిక్ రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాత: నిఖిల కోనేరు
బ్యానర్: హార్నిక్స్ ఇండియా LLP
DOP: నిజార్ షఫీ
సంగీతం: మిక్కీ జె మేయర్
కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
యాక్షన్: రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్
