
Nagabhandam Song Shoot in Anantha Padmanabha Temple Set with 5000 Dancers
నాగబంధం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్లో 5000 మంది డ్యాన్సర్స్ తో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ లో సాంగ్ షూటింగ్
యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్లో కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన పాన్-ఇండియా ఫిలిం ‘నాగబంధం’ చేస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విరాట్ కర్ణ పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వైల్డ్ అవాతర్ లో కనిపించిన అతని జిమ్ ఫోటోలు సినిమా కోసం అతని అంకితభావాన్ని చూపించాయి.
సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం, మేకర్స్ ఒక కీలకమైన సన్నివేశాన్ని, ఒక పాటను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్ లో చిత్రీకరించారు. అద్భుతంగా నిర్మించిన ఈ సెట్ సందర్శించి మీడియాను సర్ ప్రైజ్ చేసింది. కేరళలోని అసలు దేవాలయానికి కచ్చితమైన ప్రతిరూపంగా కనిపిస్తోందని ఎంతోమంది ప్రశంసించారు.
ఈ పాటలో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణతో పాటు 5000 మంది నృత్యకారులు పాల్గొంటున్నారు. ఈ అద్భుతమైన సీక్వెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా వుంటుంది.
ఒక్క ఎపిసోడ్‌కే రూ. 10 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ‘నాగబంధం’ ఒక విజువల్ స్పెక్టకిల్‌గా ఉండబోతోంది. ఈ ఎపిసోడ్ కోసం వేసిన భారీ సెట్, అంతే స్థాయిలో నిర్మాణం టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా..జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియన్ ఫిల్మ్ నాగబంధం పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో వుంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధంలో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పనిచేస్తున్నారు. అభే సంగీత దర్శకుడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాశారు సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
తారాగణం: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: NIK స్టూడియోస్ & అభిషేక్ పిక్చర్స్
సమర్పణ: లక్ష్మీ ఐరా & దేవాన్ష్
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: కిషోర్ అన్నపురెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే
సీఈవో: వాసు పోతిని
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
ఎడిటర్: RC పనవ్
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విన్ రాజేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభినేత్రి జక్కల్
యాక్షన్: వెంకట్, వ్లాడ్ రింబర్గ్
స్క్రిప్ట్ డెవలప్మెంట్: శ్రా1, రాజీవ్ ఎన్ కృష్ణ
Vfx: థండర్ స్టూడియోస్
Vfx సూపర్వైజర్: దేవ్ బాబు గండి (బుజ్జి)
పబ్లిసిటీ డిజైన్స్: కాని స్టూడియో