
Manchu Manoj to Romance International actress Maria Riaboshapka for David Reddy
Rocking Star Manchu Manoj is currently starring in the upcoming film “David Reddy.” The movie is being produced by Nallagangula Venkat Reddy and Bharat Motukuri under the Velvet Soul Motion Pictures and True Radix banners. It is directed by Hanuma Reddy Yakkanti. Set against the backdrop of the British colonial era, “David Reddy” is being made as a large-scale pan-India film with an intense action drama storyline. The film is being produced in Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada.
The makers have now shared an exciting update by officially announcing that international actress Maria Riaboshapka will play the heroine in the film. According to the team, the scenes featuring Manchu Manoj and Maria Riaboshapka will showcase strong on-screen chemistry and are expected to impress the audience.
“David Reddy” tells the story of a warrior who rises in rebellion against the British Empire. Manchu Manoj will be seen in a completely new avatar in this film. The glimpses and first-look posters released earlier have already received a huge response. Expectations are growing that this film could mark a strong comeback for Manoj. The story is set during the British rule between 1897 and 1920, and the makers are producing the film on a prestigious scale.
Cast
Manchu Manoj, Maria Riaboshapka, R. Parthiban, Kanchana, and others.
Technical Team
Art – Ravi Jakkula
Costumes – Haindavi Sudha
Action – Supreme Sundar
Editing – Ujwal Kulkarni
DOP – Acharya Venu
Music – Ravi Basrur
Executive Producer – Kottu Ravikumar
PRO – GSK Media (Suresh – Sreenivas)
Producers – Bharat Motukuri, Nallagangula Venkat Reddy
Story, Screenplay, Director – Hanuma Reddy Yakkanti
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ మూవీ “డేవిడ్ రెడ్డి”లో హీరోయిన్ గా నటించనున్న మారియా ర్యాబోషాప్కా
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా “డేవిడ్ రెడ్డి”. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా “డేవిడ్ రెడ్డి” సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా నటించనుందని అఫీషియల్ గా ప్రకటించారు. మంచు మనోజ్, మరియా ర్యాబోషాప్కా మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యోధుడి తిరుగుబాటు కథగా రూపొందుతున్న “డేవిడ్ రెడ్డి” చిత్రంలో మంచు మనోజ్ కొత్త అవతార్ లో కనిపించనున్నారు. ఇప్పటికే “డేవిడ్ రెడ్డి” సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మనోజ్ కు ఒక మంచి కమ్ బ్యాక్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని “డేవిడ్ రెడ్డి” సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ రూపొందిస్తున్నారు.
నటీనటులు – మంచు మనోజ్, మరియా ర్యాబోషాప్కా, ఆర్. పార్తీబన్, కాంచన, తదితరులు
టెక్నికల్ టీమ్
———————
ఆర్ట్ – రవి జక్కుల
కాస్ట్యూమ్స్ – హైందవి సుధ
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
ఎడిటింగ్ – ఉజ్వల్ కులకర్ణి
డీవోపీ – ఆచార్య వేణు
మ్యూజిక్ – రవి బస్రూర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కొట్టు రవికుమార్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – భరత్ మోటుకూరి, నల్లగంగుల వెంకట్ రెడ్డి
స్క్రిప్ట్, డైరెక్టర్ – హనుమరెడ్డి యక్కంటి
