ప్రేమంటే కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్

Maha Group Chairman Vamsi Krishna Invites Telangana Chief Minister Revanth Reddy to Sri Srinivasa Kalyana Mahotsavam
Under the auspices of Maha Group and Maha Bhakti Channel, the grand Sri Srinivasa Kalyana Mahotsavam, organized by Tirumala Tirupati Devasthanams (TTD), is set to take place on November 26 at the Gachibowli Stadium in Hyderabad.
As part of the preparations, Maha Group Chairman Marella Vamsi Krishna personally met and invited Telangana Chief Minister Sri Revanth Reddy to grace the occasion as the Chief Guest.
Celebrated every year with immense devotion and cultural splendor, this year’s Mahotsavam is expected to be a major spiritual attraction in Hyderabad. Organizers anticipate the participation of thousands of devotees who look forward to witnessing the divine rituals and festivities.
The event will commence at 5:00 PM on November 26, featuring special pujas, sacred Sevas of Lord Venkateswara, and a variety of cultural programs presented as part of the celebrations.
The organizers have extended a heartfelt invitation to all devotees to attend the Mahotsavam and seek the divine blessings of Sri Venkateswara Swamy.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన మహా గ్రూప్ చైర్మన్ వంశీ కృష్ణ
మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో “తిరుమల తిరుపతి దేవస్థానం” (TTD) వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు.
ప్రతి ఏడాది భక్తి, సంప్రదాయాలతో నిర్వహించే ఈ మహోత్సవం ఈసారి హైదరాబాదులో విశేషమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు. నంబర్ 26వ తేదీన సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
భక్తులందరినీ ఈ వేడుకలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.
