
Kantara Chapter 1 Outstanding Feat, Storms Past 110 Cr+ In Telugu States, Worldwide Roar Crosses 818 Cr+ Gross
Rishab Shetty’s latest sensation Kantara Chapter 1 is maintaining its golden streak even into its fourth week of release. The film, a rich blend of mythology, folklore, and high-octane action, has not only won over audiences but also rewritten box office records.
Directed by Rishab Shetty and produced by Hombale Films, Kantara Chapter 1 has stormed past an extraordinary 818 crore worldwide, with the Telugu states alone contributing 110 crore+. This feat makes it the highest-grossing Indian film of the year and places it as the second-highest-grossing dubbed film in Telugu states, just behind the monumental KGF: Chapter 2.
The movie is edging closer to the $5 million mark in North America. It is set for an English-dubbed release on October 31st, with a crisper runtime. The English version is expected to broaden the film’s reach and further boost its box office numbers.
ఆల్టైమ్ రికార్డులు బద్దలు కొడుతూ వరల్డ్ వైడ్ 818 కోట్ల మార్క్ దాటిన కాంతార ఛాప్టర్ 1- తెలుగు రాష్ట్రాల్లోనే 110 కోట్ల కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్
రిషబ్ శెట్టి ‘కాంతార ఛాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మైథాలజీ, జానపదం, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం నాల్గవ వారం కూడా థియేటర్లలో హౌస్ఫుల్ షోలతో కొనసాగుతోంది.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ మాగ్నమ్ ఓపస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.110 కోట్లకు పైగా సాధించడం విశేషం. దీంతో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే, KGF చాప్టర్ 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.
కాంతార ఛాప్టర్ 1 అమెరికాలో కూడా దూసుకుపోతోంది. $5 మిలియన్ మార్క్ చేరువలో ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 31న ఇంగ్లీష్ డబ్ వెర్షన్ విడుదల కానుంది. షార్ఫ్ రన్టైమ్తో రాబోతున్న ఈ వెర్షన్ అంతర్జాతీయ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోనుంది.
