
విష్ణు విన్యాసం నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఈ చిత్రానికి దర్శకత్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామచారి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ‘దేఖో విష్ణు విన్యాసం’కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ మొదలే మొదలే సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం లవ్ ఫీలింగ్ ని అందంగా ప్రజెంట్ చేసింది. మధుశ్రీ, నరేష్ అయ్యర్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి.
ఈ సాంగ్ లో శ్రీ విష్ణు, నయన సారిక కెమిస్ట్రీ లవ్లీగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ గా నిలిచే ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్‌గా అలరిస్తోంది.
ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందించగా, ఎ. రమణాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్, కార్తికేయన్ రోహిణి ఎడిటర్
ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
ప్రొడక్షన్ హౌస్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత: సుమంత్ నాయుడు జి
సమర్పణ: హేమ & షాలిని
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
DOP: సాయి శ్రీరామ్
సంగీతం: రధన్
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
కొరియోగ్రఫీ: భాను మాస్టర్
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
PRO: వంశీ-శేఖర్
