Telugu Film Industry Expresses Gratitude to Government & Police for

తల్లిదండ్రులైన వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి – హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తండ్రి అయ్యారు. లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
కొణిదెల కుటుంబంలో పుట్టిన చిన్నారి బాబుకు హృదయపూర్వక స్వాగతం. తల్లిదండ్రులుగా మారిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
తాతయ్య, అమ్మమ్మలుగా ప్రమోషన్ పొందిన నాగబాబు, పద్మజలకు శుభాకాంక్షలు.
బాబుకు సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఆశీర్వాదాలు కావాలని, ఎల్లప్పుడూ మీ ప్రేమ, దీవెనలు వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
