Varun Sandesh, Shweta Basu Prasad’s aha Original Naa Wife Missing

Maya Lady Unveils Cheekato Vaipuna Lyrical Song
Young talented hero and passionate producer Rakesh Varre is coming up with his latest film Maya Lady. Rakesh Varre plays the lead role and is also producing the movie under the Crazy Ants Productions banner. He previously earned appreciation for producing content-driven films such as Evvarikee Cheppoddhu and Pekamedalu under the same banner. With Mayaledi, he is now set to bring another interesting film to audiences. The movie is directed by Prasankar, with Madhumita Sarcar playing the female lead. Maya Lady is gearing up for a grand theatrical release soon.
The makers today released the lyrical song ‘Cheekato Vaipuna’ from the film. The soulful tune has been composed by Vishal Chandrashekhar, with lyrics penned by Krishna Kanth. Yazin Nizar and Sindhuri Vishal have lent their voices to the song.
‘Cheekato Vaipuna’ is a deeply emotional track that captures the pain and loneliness of a heartbroken lover. The lyrics beautifully reflect the character’s inner turmoil, uncertainty and fading hopes, creating a poignant mood throughout the song. The combination of Vishal Chandrashekhar’s haunting composition, Krishna Kanth’s heartfelt lyrics and the expressive vocals of Yazin Nizar and Sindhuri Vishal gives the track a strong emotional impact.
Cast: Rakesh Varre, Madhumita Sarcar and others
Technical Team:
Music: Vishal Chandrashekhar
Banner: Crazy Ants Productions
Producer: Rakesh Varre
Script & Direction: Prasankar
PRO: Suresh (SK Media)
యంగ్ టాలెంటెడ్ హీరో రాకేష్ వర్రే “మాయలేడి” మూవీ నుంచి ‘చీకటో వైపున..’ లిరికల్ సాంగ్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే “మాయలేడి” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “మాయలేడి” సినిమా నుంచి మేకర్స్ ”చీకటో వైపున..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ట్యూన్ కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. సింగర్ యాజిన్ నిజార్, సింధూరి విశాల్ పాడారు. ‘చీకటో వైపున..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘చీకటో వైపున, వేకువో వైపున తేల్చలేని యదే శూన్యమా, మౌనమే నేరమా, ఊహలే శూన్యమా, జాలిలేని విధే కాలమా, ఆశలే క్షణాలలోనే వీడిపోయెనా, కాలమే గతాలలోనే ఆగిపోయెనా, సమస్తం నిశ్శబ్దం, అయ్యే నేడిలా నువ్వే నా ప్రపంచం కదా…’ అంటూ గాయపడిన ప్రేమికుడి బాధను వ్యక్తం చేస్తూ హార్ట్ టచింగ్ గా సాగుతుందీ పాట.
నటీనటులు -రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, తదితరులు
టెక్నీషియన్స్
——————–
మ్యూజిక్ – విశాల్ చంద్రశేఖర్
బ్యానర్ – క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ – రాకేష్ వర్రే
స్క్రిప్ట్, డైరెక్షన్ – ప్రశంకర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
