ఎల్జీబీటీ పార్ట్-2కు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం –

Rashmika Mandanna Opens Up About Her Leg Injury, Says Injuries Are Frustrating in Instagram Post
Actress Rashmika Mandanna, who was recently injured while filming a dance sequence for her upcoming film Mysaa, has finally spoken about her condition. Following the injury, doctors advised her to take six weeks of complete rest. As per medical advice, the actress is currently on bed rest and recently shared an emotional update through an Instagram post.
Speaking about her injury, Rashmika said, “Getting injured is extremely frustrating for me. I didn’t want anyone to know about this injury, but it eventually came out. This is the third time I’ve suffered this kind of injury. There are four tendons on each side that connect the hip to the leg. One of the tendons in my right hip has been torn. For me to lift my leg again, it has to heal completely. This accident happened while I was shooting a dance sequence for Mysaa. Among all the films I’m working on, Mysaa has been the most physically demanding. I feel that perhaps God wanted me to finally take some rest, and that’s why this injury happened.”
Rashmika is currently working on the films Ranabaali and Mysaa, apart from two other big-budget projects. She is also the brand ambassador for around 30 products. With her suffering a serious injury, the shooting schedules for her films as well as several advertisement campaigns have been temporarily put on hold.
కాలి గాయంపై స్పందించిన హీరోయిన్ రశ్మిక మందన్న, గాయాలు చికాకు తెప్పిస్తాయని ఇన్ స్టా పోస్ట్
ఇటీవల మైసా సినిమాలో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా తీవ్రంగా గాయపడింది హీరోయిన్ రశ్మిక మందన్న. ఆమె 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు రశ్మిక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమె తాజాగా తన కాలి గాయంపై స్పందించారు. ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు.
ఈ పోస్ట్ లో రశ్మిక మందన్న స్పందిస్తూ – గాయాలు అవ్వడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నా కానీ తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు పైకి ఎత్తాలి అంటే అది మళ్లీ అతుక్కోవాలి. మైసా సినిమా కోసం డాన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నేను చేస్తున్న సినిమాల్లో మైసా అత్యంత కష్టమైన సినిమా. నేను విశ్రాంతి తీసుకోవడానికే దేవుడు ఈ గాయం బారిన పడేలా చేశాడని భావిస్తున్నాను. అని అన్నారు.
ప్రస్తుతం రశ్మిక రణబాలి, మైసా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వీటితో పాటు మరో రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే 30 ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రశ్మికకు అయిన తీవ్ర గాయంతో ఆయా సినిమాల, వ్యాపార ప్రకటనల షూటింగ్స్ నిలిచిపోయాయి.
