రావు బహదూర్ తెలుగు సినిమాకి రిఫరెన్స్ పాయింట్ అవుతుంది – నాగచైతన్య

NKR Birthday Special – Team #VenkyAnil5 #NkrAR2 Unveiled NKR Traditional & Stylish First Look
One of the most exciting projects in Telugu cinema is shaping up to be a perfect festive family entertainer as Victory Venkatesh, Nandamuri Kalyan Ram, and blockbuster hit machine Anil Ravipudi come together for a grand entertainer, currently referred to as #VenkyAnil5 and #NkrAR2. The prestigious venture is being produced by Sahu Garapati under the Shine Screens banner on a lavish scale. Adding further strength to the project, Suresh Productions, Smt. Archana, and Zee Studios are presenting the film.
Marking Kalyan Ram’s birthday, the makers unveiled his first look from the movie, presenting him in a lively and celebratory avatar. Dressed in a traditional white pancha and kurta with a flower garland around his neck, Kalyan Ram is seen striking an energetic dance pose with effortless swagger. Sporting stylish sunglasses and a cheerful smile, he radiates festive charm.
Set against the backdrop of a beautifully decorated traditional house adorned with colorful floral garlands and surrounded by women dancing joyfully, the poster perfectly captures the festive spirit of the film. It is truly an “Acha Telugu” first look, hinting at a wholesome family entertainer packed with fun, humor, emotions, and grand celebrations.
Remarkably, Kalyan Ram opened an Instagram account (@nandamurikalyanram) to unveil and share his first look from the film. “It’s always a delight to be in @AnilRavipudi’s zone… This Sankranthi 2027, get ready for a blast! #VenkyAnil5 #NKRAR2” he wrote on Instagram. This once again reflects the unique promotional strategies director Anil Ravipudi adopts for his movies.
Bringing together an impressive ensemble, National Award-winning actress Keerthy Suresh stars opposite Venkatesh, while Krithi Shetty is paired with Kalyan Ram. The shoot is progressing at a brisk pace in Hyderabad.
The film boasts a strong technical team to complement its star-studded cast. Music sensation GV Prakash Kumar is composing the soundtrack, while cinematographer Sameer Reddy is handling the visuals. Editing is in the hands of Tammiraju, with AS Prakash creating the film’s colourful world as the production designer. S Krishna is serving as the executive producer.
With Anil Ravipudi at the helm, the film is expected to blend his trademark entertainment, humour, and emotions, promising a perfect Sankranthi entertainer.
Cast: Victory Venkatesh, Nandamuri Kalyan Ram, Keerthy Suresh, Krithi Shetty
Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Producer: Sahu Garapati
Presents: Suresh Productions, Zee Studios, Smt Archana
Music: GV Prakash Kumar
Executive Producer: S Krishna
Cinematographer: Sameer Reddy
Editor: Tammiraju
Art Director: AS Prakash
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి #VenkyAnil5 / #NkrAR2 నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ట్రెడిషనల్, స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ మ్యాసీవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ #VenkyAnil5 / #NkrAR2, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.
కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ ఉత్సాహంగా, పండుగ వాతావరణంలో కనిపించారు. తెల్లటి పంచె, కుర్తా ధరించి, మెడలో పూలదండతో స్టైలిష్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని డ్యాన్స్ స్టెప్ వేస్తూ ఆయన కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. చిరునవ్వుతో ఆయన లుక్ ఫెస్టివల్ వైబ్‌ను తీసుకొచ్చింది.
అందంగా అలంకరించిన సంప్రదాయ ఇంటి నేపథ్యంలో, రంగురంగుల పూలతోరణాలు, ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న మహిళల మధ్య రూపొందించిన ఈ పోస్టర్ సినిమా పండుగ వాతావరణాన్ని అద్భుతంగా చూపిస్తోంది. ఇది నిజమైన “అచ్చ తెలుగు” ఫస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఫన్, కామెడీ, ఎమోషన్స్, గ్రాండ్ సెలబ్రేషన్స్‌తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తోంది.
విశేషం ఏమిటంటే, ఈ ఫస్ట్ లుక్‌ను షేర్ చేయడానికి కళ్యాణ్ రామ్ @నందమూరికళ్యాణ్రామ్ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించారు. “అనిల్ రావిపూడి జోన్లో ఉండటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది… సంక్రాంతి 2027కి ఒక భారీ ఎంటర్టైనర్కు సిద్ధంగా ఉండండి” అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇది కూడా అనిల్ రావిపూడి సినిమాల ప్రమోషన్స్‌లో ఉండే ప్రత్యేకతను మరోసారి చూపించింది.
ఈ సినిమాలో వెంకటేష్ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ వేగంగా జరుగుతోంది.
ఈ ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ చేయగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఎమోషన్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా సంక్రాంతి 2027కి పక్కా ఫ్యామిలీ ట్రీట్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: సాహు గారపాటి
సమర్పకులు: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
