రావు బహదూర్ చిత్రానికి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ – సత్య

EVV Cinema Production No.10 & NVR Entertainments Production No.1 begins with Pooja Ceremony
One of Telugu cinema’s most iconic and celebrated production houses, EVV Cinema, founded by legendary filmmaker E.V.V. Satyanarayana, is making a prestigious comeback. The banner, which delivered memorable entertainers such as Chala Bagundi, Maa Aavida Meeda Ottu Mee Aavida Chala Manchidi, Thotti Gang, Athili Sattibabu LKG, and Fitting Master, Nuvvu ante naku istam, Kithakktalu, is now being revived by Aryan Rajesh, son of the late filmmaker. Joining hands with N.V. Krishna Reddy of NVR Entertainments, Aryan Rajesh is backing an intense love drama inspired by a real-life story, carrying forward the rich legacy of EVV Cinema. The film stars Harsh Roshan in the lead alongside Priyanka Achar. Harsh, who won widespread appreciation with Court and established himself as one of the most promising young actors in Telugu cinema, is set to headline another emotionally driven story.
The project marks the directorial debut of Arun Balaji and Shree Ranjani, who have crafted a love story rooted in real-life emotions and relationships. The film began with an auspicious pooja ceremony recently and the shoot begins soon. Backed by EVV Cinema and NVR Entertainments, the film promises a refreshing blend of realism, intense emotions, and strong storytelling.
With the revival of one of Telugu cinema’s most respected banners and a compelling true story at its heart, the makers are confident that the film will resonate with audiences across generations. More details regarding the title, first look, and release plans will be announced soon.
Cast: Harsh Roshan, Priyanka Achar & others
Technical Crew:
Banners: EVV Cinema & NVR Entertainments
Producers: NV Krishna Reddy & Aryan Rajesh
Directors: Arun Balaji – Shree Ranjani
DOP: Jiju Sunny
Executive Producer: Vineel Nallamilli
Marketing: Vishnu Thej Putta
PRO: Maduri Madhu
పూజా కార్యక్రమంతో ప్రారంభమైన లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ ఈవీవీ సినిమా ప్రొడక్షన్ నెం.10, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.1: హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా నూతన చిత్రం ప్రారంభం
తెలుగు సినిమా రంగంలో ఐకానిక్, పేరెన్నికగన్న నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈవీవీ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తాజాగా ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లెజెండరీ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్‌పై గతంలో ‘చాలా బాగుంది’, ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’, ‘తొట్టి గ్యాంగ్’, ‘అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ’, ‘ఫిట్టింగ్ మాస్టర్’, నువ్వంటే నాకిష్టం, కితకితలు వినోదాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ లెజండరీ బ్యానర్‌పై ఈవీవీ గారి తనయుడు ఆర్యన్ రాజేష్ మరో నిర్మాత ఎన్.వి.కృష్ణారెడ్డితో కలిసి ఓ సినిమా నిర్మంచబోతున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హర్ష్ రోషన్ హీరోగా, ప్రియాంక ఆచర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘కోర్ట్’ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్, తెలుగు సినిమాలో ప్రతిభావంతులైన యువ నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో భావోద్వేగ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంలో ఈ ప్రేమకథను వారు రూపొందించారు. ఈ సినిమా ఇటీవల శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవికత, తీవ్ర భావోద్వేగాలు, బలమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
నటీనటులు: హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్లు: ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: ఎన్.వి. కృష్ణారెడ్డి, ఆర్యన్ రాజేష్,
దర్శకులు: అరుణ్ బాలాజీ, శ్రీ రంజని
డీఓపీ: జిజు సన్నీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినీల్ నల్లమిల్లి
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట
పీఆర్వో: మడూరి మధు
