అశ్వినీ దత్ గారి నిర్మాణంలో శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా పరిచయం కావడం

అశ్వినీ దత్ గారి నిర్మాణంలో శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను – జయకృష్ణ ఘట్టమనేని
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని ఇప్పటికే తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. విజువల్‌గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. లెజెండరీ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శ్రీను&మంగా పాత్రలని పరిచయం చేస్తూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.
శ్రీను & మంగా ఈవెంట్ లో హీరో జయకృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తాతయ్య కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. తాతయ్య నాకు దేవుడితో సమానం. ఆయనపై నాకు ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. ‘శ్రీనివాస మంగాపురం’ నా తొలి చిత్రం. అజయ్ భూపతి గారు ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ఉన్న ఎమోషన్స్, నా పాత్రలోని డెప్త్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని భావించాను. అజయ్ భూపతి గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాకే ఆయనలాంటి దర్శకుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. దత్తు గారు మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేష్ బాబు గారితో ‘రాజకుమారుడు’ చేశారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. కిరణ్ గారే నాకు అజయ్ భూపతి గారిని పరిచయం చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. మా డీవోపీ జై కృష్ణ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్‌బస్టర్ అవుతాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. జీవీ ప్రకాష్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. రాషా అద్భుతమైన నటి. అలాగే చాలా మంచి మనిషి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుంది. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. మోహన్ బాబు గారు, నరేష్ గారు వంటి లెజెండరీ నటులతో కలిసి నటించడం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమాను మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. నేను మహేష్ బాబాయ్‌కు డైహార్డ్ ఫ్యాన్‌ని. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను ఆయనే లాంచ్ చేశారు. ఎప్పటికప్పుడు నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్యూ సో మచ్ బాబాయ్. ఈ సందర్భంగా మా నాన్నగారు రమేష్ బాబు గారిని తలుచుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
హీరోయిన్ రాషా తడాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా స్పెషల్ సినిమా. ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. జయకృష్ణతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం. మనందరం కూడా కృష్ణ గారు, మహేష్ బాబు గారికి అభిమానులమే. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా డైరెక్టర్ అజయ్ భూపతి గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సభ్యులు అందరూ నాకు ఎంతో సహకరించారు. ముఖ్యంగా ‘మంగా’ పాత్రను అర్థం చేసుకుని చేయడంలో వారి సపోర్ట్ ఎంతో ఉపయోగపడింది. తెలుగు భాష విషయంలో జయకృష్ణ నాకు చాలా సహాయం చేశారు. ఈ సినిమా నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. అందరికీ థ్యాంక్యూ.
డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఒకపక్క దత్తు గారు, మరోపక్క కిరణ్ గారు, ఇంకోపక్క ఆదిశేషగిరిరావు గారు, కనిపించని నాలుగో సింహం మా స్వప్న గారు(నవ్వుతూ) ఈ నలుగురితో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. ఈరోజు ఇండియాలో టాప్ లేడీ ప్రొడ్యూసర్ స్వప్న గారే. కృష్ణ గారు అంటే మామూలు విషయం కాదు. ఆయన నిజమైన సూపర్ స్టార్. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసి ఉండరు. ఆ కృష్ణ గారి క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. కచ్చితంగా జయకృష్ణ చాలా పెద్ద హీరో అవుతాడు. ‘శ్రీనివాస మంగాపురం’ ఆడియో ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. అలాగే రాషా కూడా అద్భుతంగా నటించింది. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. రాషా, జయకృష్ణ పోటీపడి నటించారు. జీవీ ప్రకాష్ పాటలన్నీ అదరగొట్టాడు. ఇది దాదాపు పూర్తిగా అవుట్‌డోర్‌లో తెరకెక్కించిన సినిమా. ఆ ఫీల్ మీకు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్‌కు పేరుపేరునా ధన్యవాదాలు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. తెలుగు సినిమాకు కొత్త అందం, వన్నె తీసుకొచ్చిన నిర్మాత అశ్వినీ దత్ గారు. అలాగే తెలుగు సినిమాకు కొత్త దిశ చూపించిన దర్శకుడు రాఘవేంద్రరావు గారు. వీరిద్దరూ కలిసి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు దత్తు గారి నిర్మాణంలో జయకృష్ణ పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాను చాలా అద్భుతంగా తీశారు. స్వప్న ఈ సినిమా చూసి ‘చాలా బాగుంది అంకుల్’ అని చెప్పింది. అది మాకు పాస్ సర్టిఫికెట్ లా అనిపించింది. (నవ్వుతూ) అజయ్ భూపతి అద్భుతంగా తెరకెక్కించారు. నటీనటులు, టెక్నీషియన్లు అందరూ ఎంతో బాగా పనిచేశారు. కృష్ణ గారిలాగే జయకృష్ణ కూడా తన ప్రతిభను చూపించాడు. కృష్ణ గారు ఎక్కడ ఉన్నా జయకృష్ణను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని ఆశీర్వదిస్తున్నాను.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఎంతో ఇష్టమైన నిర్మాతలు అశ్వినీ దత్ గారు, కిరణ్ గారు. అజయ్ భూపతి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. మొదటి సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జయకృష్ణను మొదటిసారి చూసినప్పుడే మంచి హీరో అవుతాడని అనుకున్నాను. ఇప్పుడు అశ్వినీ దత్ గారి నిర్మాణంలో హీరోగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. కృష్ణ గారు మహానుభావుడు. ఆయన మనవడిగా వస్తున్న జయకృష్ణ కూడా గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. అందరి అంచనాలను మించేలా ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. టీజర్ చాలా బాగుంది. ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా రమేష్ బాబు ఎక్కడ ఉన్నా జయకృష్ణను ఆశీర్వదిస్తాడని భావిస్తున్నాను. అలాగే అన్నయ్య కృష్ణ గారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. జయకృష్ణ న్యూయార్క్‌లో ఫిల్మ్ కోర్స్ చదివాడు. దత్తు గారి ద్వారా పరిచయం అయితే బాగుంటుందని అనుకున్నాం. అలా ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. అశ్వినీ దత్ గారు ఈ సినిమాకు కావాల్సిన ప్రతిదీ ఎక్కడా రాజీ పడకుండా సమకూర్చారు. అజయ్ భూపతి, జీవీ ప్రకాష్ కుమార్ వంటి అద్భుతమైన టెక్నీషియన్లు ఈ చిత్రంలో పనిచేశారు. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. అశ్వినీ దత్ గారికి మా కుటుంబంతో ఎంతో మంచి అనుబంధం ఉంది. కృష్ణ గారితో ఎన్నో చిత్రాలు తీశారు. మహేష్ బాబును పరిచయం చేశారు. ఇప్పుడు జయకృష్ణను పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. రాషా కూడా చాలా చక్కగా నటించింది. మోహన్ బాబు గారు అద్భుతమైన పాత్ర చేశారు. ఆయన డబ్బింగ్ చెప్పిన తర్వాత ‘సినిమా చాలా బాగా వచ్చింది, జయకృష్ణ అద్భుతంగా చేశాడు’ అని చెప్పారు. ఇంత మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న అశ్వినీ దత్ గారికి మరోసారి ధన్యవాదాలు.
కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు వైజయంతి మూవీస్‌తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్‌లో కృష్ణ గారితో చేసిన ‘అగ్నిపర్వతం’ పెద్ద సంచలన విజయం సాధించింది. తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘రాజకుమారుడు’ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అదే వైజయంతి మూవీస్‌లో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే నాకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ‘శ్రీనివాస మంగాపురం’ అనే పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. రోజూ వెంకటేశ్వర స్వామి హుండీలో ఎన్ని కోట్లు పడతాయో, అన్ని కోట్ల కలెక్షన్లు ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.
అశ్వినీ దత్ మాట్లాడుతూ. పిలవగానే వచ్చిన అతిథి దేవుళ్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా జూలై 9 మీ ముందుకు వస్తోంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 52 సంవత్సరాలు అయింది. రాఘవేంద్రరావు గారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నాకు సహకరించిన హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ నా కృతజ్ఞతలు. ఎన్టీఆర్ గారు, కృష్ణ గారితో సినిమాలు చేశాను. ఆ తర్వాత నేను పరిచయం చేసిన మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.
నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు, బ్రహ్మాజీ తదితరులు
సిబ్బంది:
రచన & దర్శకత్వం – అజయ్ భూపతి
సమర్పణ – అశ్విని దత్
నిర్మాతలు – జెమిని కిరణ్
బ్యానర్ – చందమామ కథలు పిక్చర్స్
సంగీతం – జివి ప్రకాష్
డిఓపి – జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్ – మాధవ్ కుమార్ గుళ్లపల్లి
PRO – వంశీ శేఖర్
డిజిటల్ మార్కెటింగ్ – హాష్‌ట్యాగ్ మీడియా
