ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం – తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్

RK Deeksha Grand Theatrical Release on June 12th
Under the banners of RK Films and Sigdha Creations, Dr. Prathani Ramakrishna Goud has directed and produced the film “RK Deeksha”, presented by DS Reddy. The movie stars Dhee and Jodi fame Aksha Khan and Alekhya Reddy as the female leads, while Kiran plays the hero. Tulasi, Anusha, Keerthana, Pravallika, and Rohit Sharma appear in important roles.
The film has successfully completed its censor formalities and is gearing up for a grand theatrical release on June 12th. The makers officially announced the release date during a press meet held today.
Speaking at the event, director-producer Dr. Prathani Ramakrishna Goud said:
“Our film ‘RK Deeksha’ has completed censor formalities and received an ‘A’ certificate due to the intense action sequences in the movie. We thank the censor officials for granting the certificate with very minimal cuts. The film has shaped up really well. The hero’s character reflects determination and dedication, proving that anything can be achieved with strong willpower. Hero Kiran will earn a good name through this movie. His one-minute non-stop dialogue as Bhimuni will be one of the highlights.
Aksha Khan plays a dancer in the film. Her song ‘Nandi Nandi’ will receive a great response from audiences. Rohit Sharma appears as her boyfriend in a negative role. Tulasi has played a strong role alongside Aksha Khan and Alekhya Reddy. Music director Raj Kiran has delivered chartbuster songs. A special patriotic song highlighting the greatness of Indian soldiers has been sung by Madhupriya. We will soon release the audio. I strongly believed in this story and produced the film without compromising anywhere. We faced a slight delay during the censor process, but now we are bringing ‘RK Deeksha’ to theatres on June 12th. After this project, we will begin a women’s kabaddi-based film.”
Hero Kiran said:
“I have acted in several films earlier and am currently working on three pan-India movies. I am very happy to be part of ‘RK Deeksha’. I got a performance-oriented role in this film. Since my childhood as a child artist, I have been striving hard to establish myself in the film industry with dedication, and director Ramakrishna Goud gave me a similar role in this movie too. I performed a one-minute dialogue as Bhimuni, followed by a powerful fight sequence. ‘RK Deeksha’ has action, romance, comedy, and all commercial elements. We hope audiences will support our film.”
Heroine Aksha Khan said:
“I play a dancer in ‘RK Deeksha’. Since I am also a dancer in real life, I strongly connected with the character. The ‘Nandi Nandi’ song, which is based around Nandi Awards, has come out beautifully. Along with songs, the movie also has impressive action sequences. I thank Ramakrishna Goud garu for giving me this opportunity. My characterization in the film is beautiful. My co-star Kiran worked very passionately for the movie, and I wish him a bright future. Our film is releasing on June 12th, and I request everyone to watch and support it.”
Actress Tulasi said:
“I share scenes with Aksha Khan and Alekhya Reddy in this movie. I thank Ramakrishna Goud garu for giving me this opportunity. A special song in the film showcasing the bravery and sacrifices of our soldiers will impress everyone. The song has been sung by Madhupriya. I hope audiences make ‘RK Deeksha’ a big success when it releases on June 12th.”
Actress Mounika said:
“I am a classical dancer, and I wish ‘RK Deeksha’, produced under the RK Films banner by Ramakrishna Goud garu, becomes a grand success.”
Cast
Kiran, Aksha Khan, Alekhya Reddy, Tulasi, Anusha, Keerthana, Pravallika, Rohit Sharma, and others.
Technical Team
Director & Producer: Dr. Prathani Ramakrishna Goud
Presenter: DS Reddy
Banners: RK Films, Sigdha Creations
Music: Raj Kiran
Editor: Meghana Srinu
Fights: Ravi
Dance Choreography: Anand
PRO: Chandu Ramesh
జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన “ఆర్ కే దీక్ష”
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ
“మా ‘ఆర్ కే దీక్ష’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. పెద్దగా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులకు ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమనే కాన్సెప్ట్‌తో హీరో పాత్రను తీర్చిదిద్దాం. హీరో కిరణ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆయన భీముని పాత్రలో చెప్పిన వన్ మినిట్ నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది.
అక్స ఖాన్ ఈ చిత్రంలో డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుంది. ఆమెపై తెరకెక్కించిన ‘నంది నంది’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రోహిత్ శర్మ నెగిటివ్ రోల్లో నటించారు. అలేఖ్య రెడ్డి, అక్స ఖాన్ కాంబినేషన్లో తులసి మంచి పాత్ర చేశారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన పాటలు అందించారు. మన వీర జవాన్ల గొప్పతనాన్ని తెలియజేసే పాటను మధుప్రియ ఆలపించారు. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మంచి కథను నమ్మి ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాం. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా తర్వాత మహిళా కబడ్డీ నేపథ్యంలో మరో చిత్రాన్ని ప్రారంభిస్తాం” అన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ –
“నేను ఇప్పటికే పలు చిత్రాల్లో నటించాను. ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను. ‘ఆర్ కే దీక్ష’లో నటించడం ఆనందంగా ఉంది. ఇందులో పర్ఫార్మెన్స్కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. చిన్నప్పటి నుంచి దీక్షగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలని ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రనే దర్శకుడు ఇచ్చారు. భీముని పాత్రలో చెప్పిన వన్ మినిట్ డైలాగ్ తర్వాత వచ్చే ఫైట్ సీన్ ప్రేక్షకులకు నచ్చుతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు ఉన్న మా సినిమాను అందరూ ఆదరించాలి” అన్నారు.
హీరోయిన్ అక్స ఖాన్ మాట్లాడుతూ –
“ఈ చిత్రంలో నేను డ్యాన్సర్ పాత్రలో నటిస్తున్నాను. నిజ జీవితంలో కూడా డ్యాన్సర్‌ను కావడంతో ఈ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. ‘నంది నంది’ పాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మంచి ఫైట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు. నా కోస్టార్ కిరణ్ ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలి. జూన్ 12న మా సినిమా విడుదలవుతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలి” అన్నారు.
నటి తులసి మాట్లాడుతూ –
“అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి కాంబినేషన్లో నా సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు. మన సైనికుల ధైర్యసాహసాలను ప్రతిబింబించే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మధుప్రియ పాడిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జూన్ 12న విడుదల కానున్న మా సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలి” అన్నారు.
నటి మౌనిక మాట్లాడుతూ –
“నేను క్లాసికల్ డ్యాన్సర్‌ను. ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిన ‘ఆర్ కే దీక్ష’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటీనటులు
కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.
టెక్నికల్ టీమ్
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డీఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజ్ కిరణ్
ఎడిటర్ : మేఘన శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : చందు రమేష్
