Making Summer Holidays with children has given me immense satisfaction

సత్య, యోగి బాబు నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 గ్రాండ్ లాంచ్, రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం
సత్య, యోగి బాబు ప్రధాన పాత్రలలో హిట్ ఎంటర్టైనర్ ‘రంగబలి’తో పేరుపొందిన పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జున రెడ్డితో కలిసి పవన్ బసంశెట్టి స్వయంగా, నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇది ప్రొడక్షన్ నెం.1. అధికారిక ప్రకటనతో పాటు, చిత్ర నిర్మాతలు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కిషోర్ తిరుమల క్లాప్ కొట్టారు. దర్శకుడు మహేష్ బాబు పి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు యధువంశీ, సందీప్ రాజ్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు.
సత్య, యోగి బాబులపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో నేడు సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
తన తొలి చిత్రం ‘రంగబలి’లో అలరించే రచనతో ప్రశంసలు అందుకున్న పవన్ బసంశెట్టి, ఇప్పుడు మరో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి, సత్య, యోగి బాబుల అద్భుతమైన కామెడీ టైమింగ్ ని పూర్తిగా ఉపయోగించుకునేలా వారికి తగిన పాత్రలని తీర్చిదిద్దారు. సహజమైన హాస్యం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు నటుల కలయికలో రాబోయే ఈ చిత్రం వినోదభరితమైన ప్రయాణంగా ఉండబోతోంది.
ఈ చిత్రానికి బలమైన టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ బాబ్లు అజు విజువల్స్ అందించనుండగా, పవన్ CH సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలను కామేష్ నిర్వహించనున్నారు.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.
నటీనటులు: సత్య, యోగి బాబు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
నిర్మాతలు: నాగార్జున రెడ్డి & పవన్ బసంశెట్టి
బ్యానర్లు: నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్
సంగీతం: పవన్ సిహెచ్
DOP: బబ్లూ అజు
ఆర్ట్ డైరెక్టర్: కామేష్
PRO: వంశీ-శేఖర్
