Mega Power Star Ram Charan’s Much-Awaited Peddi Trailer Launch on

#RN23 Launched Spectacularly, With Koratala Siva Sounding The Clapboard
Rohith Nara is gearing up for his next major project, teaming up with Karan C Productions LLP for an exciting new film. Touted as the banner’s ambitious Production No. 5, the project, currently known as #RN23, aims to deliver a feel-good romantic comedy infused with heartfelt family emotions. Produced by Bharath Chowdary, the film marks the directorial debut of Chinimilli Manikumar, who also handles the story and screenplay.
The film had a spectacular launch, with the opening ceremony graced by star director Koratala Siva and several distinguished guests. For the muhurtham shot, Koratala Siva sounded the clapboard and handed over the script, officially setting the project in motion. Maverick Producer Dil Raju directed the First Shot while Veteran Producer Chadalavada Srinivas Rao switched on the Camera.
Nayan Sarika, one of the most sought-after actresses today, has been signed on as the female lead opposite Rohith Nara. The film features a strong ensemble cast with exceptional performers such as Naresh VK, Rohini, Sampath, and Ajay in pivotal roles. Adding to the entertainment quotient, the presence of Vennela Kishore, Sudarshan, Brahmaji, and Raghu Karumanchi promises a generous dose of humor throughout the narrative.
The recently released announcement poster, stamped with the playful tagline “Shouting Soon,” instantly sparked curiosity, hinting at an energetic and colorful entertainer.
On the technical front, a skilled team of craftsmen is coming together to shape the film’s vision. Venkat C. Dileep takes charge of cinematography, bringing his visual finesse to the project, while Supriyaa Battepati helms the production design.
With Rohith Nara leading the charge and a story designed to resonate with both younger viewers and family audiences, #RN23 promises a cheerful mix of humor, romance, sentiment, and relatable moments.
More updates on this lively entertainer are expected soon.
The film’s regular shoot will commence soon.
Cast: Rohith Nara, Nayan Sarika, Naresh VK, Rohini, Sampath, Ajay, Vennela Kishore, Sudarshan, Brahmaji, Raghu Karumanchi, etc.
Production banner: Karan C Productions LLP
Producer: Bharath Chowdary Cherukuri
Presents: Srilatha Cherukuri
Story-Screenplay-Direction: Chinimilli Manikumar
DOP: Venkat C Dileep
Production Designer: Supriyaa Battepati
PRO: Vamsi Shekar
Marketing: Haashtag Media
రోహిత్ నారా, చినిమిల్లి మణికుమార్, భరత్ చౌదరి, కరణ్ సి ప్రొడక్షన్స్ LLP ప్రొడక్షన్ నెం.5, #RN23 స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్
హీరో రోహిత్ నారా తన తదుపరి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కరణ్ C ప్రొడక్షన్స్ LLP తో కలిసి ఆయన చేస్తున్న ఈ కొత్త చిత్రం బ్యానర్‌కి ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతోంది. #RN23 ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీగా, ఆకట్టుకునే కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించనుంది. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు కొరటాల శివ క్లాప్ కొట్టి, మేకర్స్ కు స్క్రిప్ట్‌ను అందజేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. మావెరిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేయగా, సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
క్రేజీ హీరోయిన్ నయన్ సారిక ఈ చిత్రంలో రోహిత్ నారాకు జోడీగా నటిస్తోంది. అలాగే నరేష్ VK, రోహిణి, సంపత్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వినోదానికి మరింత బలం చేకూర్చేందుకు వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి వంటి నటులు కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్‌పై ఉన్న “Shouting Soon” ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్లో కనిపించిన కలర్‌ఫుల్ టోన్, ఎనర్జిటిక్ వైబ్ ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఉండబోతోందని సూచిస్తోంది.
ఈ చిత్రానికి టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ C. దిలీప్ పనిచేస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను సుప్రియా బట్టెపాటి నిర్వహిస్తున్నారు.
యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలు, రిలేటబుల్ మూమెంట్స్‌తో #RN23 రూపొందుతోంది.
ఈ వినోదభరితమైన చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
మూవీ లాంచింగ్ ఈవెంట్లో హీరో రోహిత్ నారా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. లాంచింగ్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థ్యాంక్యూ. ఇది చాలా మంచి ఎంటర్టైనర్. టైటిల్, ఫస్ట్ లుక్ అన్నీ వచ్చినప్పుడు మీరందరూ చాలా ఎక్సైట్ అవుతారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నరేష్ గారితో ఇది నా రెండో సినిమా. భరత్ చౌదరి గారు చాలా పాషన్ తో ఈ సినిమా చేస్తున్నారు. సినిమాకు కావాల్సిన ప్రతి సపోర్ట్ అందిస్తున్నారు. డైరెక్టర్ మణి ఈ సినిమాతో తనేంటో నిరూపించుకుంటాడు. మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. “చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ఇది. ఈ టీమ్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత భరత్ చౌదరి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. రోహిత్ గారితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక మంచి ఎంటర్టైనర్. చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో టీమంతా పని చేస్తున్నాం. మణి చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నరేష్ గారు మా సినిమాలో చేయడం వెరీ హ్యాపీ. ఈ సినిమాలో చాలా మంచి స్టార్ కాస్ట్ ఉంది. రోహిత్ గారు గర్వపడే సినిమా ఇది అని నమ్మకంగా చెబుతున్నాను.
యాక్టర్ నరేష్ వికే మాట్లాడుతూ.. నేను ఈ ఏడాది యాక్సప్ట్ చేసిన రెండో సినిమా ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు కొత్తదనం, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి సినిమా ఇది. అన్ని హంగులున్న సినిమా. ఇందులో నేను ఒక కీలక పాత్ర పోషిస్తున్నాను. నారా రోహిత్‌తో ‘సుందరకాండ’ అనే మంచి సినిమా చేశాను. ఆ సినిమాకి మంచిన బలమైన కంటెంట్ కాన్సెప్ట్ ఇందులో వుంది. ఇది రోహిత్ గారి నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. ఈ సినిమా చాలా మంచి కమర్షియల్ వాల్యూస్‌తో వస్తుంది. నిర్మాత భరత్ చౌదరి గారు ఈ సినిమాతో మరో బెంచ్ మార్క్ అందుకుంటారు.
డైరెక్టర్ చినిమిల్లి మణికుమార్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత భరత్ చౌదరి గారికి, నారా రోహిత్ గారికి ధన్యవాదాలు. ఇందులో రోహిత్ గారిని చాలా కొత్తగా చూపిస్తాను. ఆయన సోలో సినిమా అందరూ రీకలెక్ట్ చేసుకునేలా వుంటుంది. ఇది నా ప్రామిస్. ఇది చాలా మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. జూన్ 10 నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.
నటీనటులు: రోహిత్ నారా, నయన్ సారిక, నరేష్ వికె, రోహిణి, సంపత్, అజయ్, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి
ప్రొడక్షన్ బ్యానర్: కరణ్ సి ప్రొడక్షన్స్ LLP
నిర్మాత: భరత్ చౌదరి చెరుకూరి
సమర్పణ: శ్రీలత చెరుకూరి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చినిమిల్లి మణికుమార్
DOP: వెంకట్ సి దిలీప్
ప్రొడక్షన్ డిజైనర్: సుప్రియ బట్టెపాటి
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
