
Director V. V. Vinayak Unveils Medicover Health Screening Coupon
The first medical health camp organized by the newly formed executive committee of the Telugu Film Directors Association, under the Leadership of V. N. Aditya, was held at Medicover Hospital, Gachibowli. As part of the event, noted director V. V. Vinayak unveiled a free health screening coupon.
Special arrangements were made to ensure that all association members can avail themselves of this free health check-up camp for a period of nearly one month. Medicover Telangana Region Head Dr. Ram, along with Telangana Head and PRO Mr. Santosh, personally invited the members of the Directors Association and supervised the arrangements for their required health tests.
General Secretary Pendyala Venkata Ramarao arrived at the hospital as early as 7 a.m. and reviewed the arrangements to ensure that medical tests were completed on time for every member.
Former President and senior director N. Shankar, former General Secretary and current Health Committee Chairman Ram Prasad, Treasurer Sai Rajesh, Vice Presidents V. Samudra and Bhaskar Reddy, Joint Secretary Balaji, Organizing Secretary Sunil, EC members Mallika, Sagar K. Chandra, Anjibabu, Ramana Mogili, Sai Surendra Babu, Health Committee member Ashok Kumar, and member Sitaramaraju, among others, appreciated the hospital management.
V. V. Vinayak, V. N. Aditya, Ramarao, and Sai Rajesh expressed their happiness that advanced diagnostic tests worth thousands of rupees, usually available in corporate hospitals, were being offered free of cost to the Directors Association members. They urged every member to make use of this health camp.
Additionally, the attendees appreciated the Medicover management for their hospitality, which included serving five varieties of breakfast and a healthy dry fruit kheer.
మెడికవర్ హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ఆవిష్కరించిన దర్శకుడు వి.వి. వినాయక్
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం వి.ఎన్. ఆదిత్య అధ్యక్షతన ఏర్పడిన అనంతరం నిర్వహించిన తొలి మెడికల్ హెల్త్ క్యాంప్ గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రిలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత హెల్త్ స్క్రీనింగ్ కూపన్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు.
సంఘ సభ్యులందరూ ఈ ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని సుమారు నెల రోజులపాటు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెడికవర్ తెలంగాణ రీజియన్ హెడ్ డా. రామ్, తెలంగాణ హెడ్ మరియు పీఆర్ఓ శ్రీ సంతోష్‌లు దర్శకుల సంఘ సభ్యులను ఆహ్వానించి, వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షల ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.
ప్రధాన కార్యదర్శి పెండ్యాల వెంకట రామారావు గారు ఉదయం 7 గంటలకే ఆసుపత్రికి చేరుకుని, చివరి సభ్యుడి వరకు పరీక్షలు సమయానికి పూర్తి అయ్యేలా ఏర్పాట్లను పునఃసమీక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు, సీనియర్ దర్శకులు ఎన్. శంకర్, మాజీ ప్రధాన కార్యదర్శి మరియు ప్రస్తుత హెల్త్ కమిటీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్, కోశాధికారి సాయి రాజేష్, ఉపాధ్యక్షులు వి. సముద్ర, భాస్కర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ బాలాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్, ఈసీ సభ్యులు మల్లిక, సాగర్ కె. చంద్ర, అంజిబాబు, రమణ మొగిలి, సాయి సురేంద్ర బాబు, హెల్త్ కమిటీ సభ్యుడు అశోక్ కుమార్, సభ్యుడు సీతారామరాజు తదితరులు ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించే అత్యాధునిక పరికరాలతో, వేల రూపాయల విలువైన పరీక్షలను దర్శకుల సంఘ సభ్యులకు ఉచితంగా అందించడం పట్ల వి.వి. వినాయక్, వి.ఎన్. ఆదిత్య, రామారావు, సాయి రాజేష్‌లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ హెల్త్ క్యాంప్‌ను ప్రతి సభ్యుడు తప్పనిసరిగా వినియోగించుకోవాలని వారు కోరారు.
అదనంగా, ఐదు రకాల అల్పాహారం, డ్రై ఫ్రూట్స్‌తో కూడిన ఆరోగ్యకరమైన పాయసం అందించి ఆతిథ్యం ఇచ్చిన మెడికవర్ యాజమాన్యాన్ని కార్యక్రమానికి హాజరైన సభ్యులు ప్రశంసించారు.
