
పాపం ప్రతాప్ తో తిరువీర్ వీర ప్రతాపం చూపిస్తాడని నమ్ముతున్నాను – శ్రీ విష్ణు
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈటీవీ విన్ వారు చాలా అద్భుతమైన కంటెంట్లు పట్టుకొని అందరికీ అర్థమయ్యే, రియల్‌గా అనిపించే కంటెంట్‌ను తీసుకొస్తున్నారు. వారికి ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమాకి నిర్మాతలకు కంగ్రాచ్యులేషన్స్. డైరెక్టర్ నరేష్ గారితో నాకు పరిచయం ఉంది. ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరికీ ఈ కంటెంట్ నచ్చుతుందని కోరుకుంటున్నాను. తిరువీర్ చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. ఆడియన్స్ సినిమాని ఇంకా ప్రమోట్ చేయాలని ఇస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను మనం ఇప్పుడు కూడా పాజిటివ్‌గా తీసుకోవాలి. మనం నిజాయితీగల కంటెంట్ ఇస్తున్నప్పుడు ఒక శుక్రవారం మనదే అవుతుంది. థియేటర్లు అన్నీ విపరీతంగా ఫుల్ అవుతాయి. ఆ రోజు ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్ అన్నీ గమనిస్తుంటారు. టికెట్ 99 రూపాయలు మాత్రమే. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి థియేటర్‌కి వచ్చి చూడండి. కచ్చితంగా ఈ సినిమాతో మీరు సాటిస్ఫై అవుతారని నమ్మకం ఉంది. 17న రిలీజ్ అవుతుంది, థియేటర్లో మా తిరువీర్ వీర ప్రతాపం చూపిస్తాడని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను దీవిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ వెరీ మచ్.
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. మీడియాకి, శ్రీ విష్ణు అన్నకి థాంక్యూ. శ్రీ విష్ణు అన్న చాలా మంచోడు. ఈవెంట్‌కి రావాలని జస్ట్ మెసేజ్ చేశాను, ఎంత ప్రేమతో వచ్చారు. మంచి సినిమా చేయడం ఒక ఎత్తు, దాన్ని జనం వరకు తీసుకురావడం మరో పెద్ద ఎత్తు అయిపోయింది ఈ రోజుల్లో. గత రెండు సినిమాల విషయంలో నేను బాధపడ్డాను. ఒక మంచి సినిమా చేసాం కానీ ఇంకా బాగా రీచ్ కాలేదు. గత సినిమా ప్రీ వెడ్డింగ్ షోకి మీడియా, క్రిటిక్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. కానీ జనానికి తెలిసేలోగానే సినిమా థియేటర్ నుంచి వెళ్లిపోయింది. ఓటిటీలో రెస్పాన్స్ బాగున్నప్పటికీ సినిమా థియేటర్లో ఆడితేనే బాగుంటుందని ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం కథకి, క్యారెక్టర్‌కి దగ్గరగా ఉండే అన్ని ప్రమోషన్స్ చేశాను. ఈసారి జనానికి ఈ సినిమా వస్తుందని తెలిసిందని నమ్ముతున్నాను. ప్రమోట్ చేయమన్నారు, చేశాను. ఈ సినిమాకి టికెట్ కూడా 100 రూపాయలు మాత్రమే. ఇది చాలా క్లీన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా. ఫీల్ గుడ్ సినిమా. ఏప్రిల్ 17న మీ దగ్గరలో ఉన్న థియేటర్‌కి రండి. మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయను.
డైరెక్టర్ ఎస్.పి. దుర్గ నరేష్ మాట్లాడుతూ.. ఈటీవీ విన్, మా ప్రొడ్యూసర్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ. ఈ సినిమా మీతో మాట్లాడుతుంది, మీరు మాట్లాడేలా చేస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మా డిఓపీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఉన్న విజువల్స్‌కు ప్రాణం పోసింది. సురేష్ బొబ్బిలి గారు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తిరువీర్ గారు చాలా మంచోడు. నేను ఏం చెప్పినా చేశారు. నా తొలి సినిమాకి ఆయన దొరకడం నా అదృష్టం. శ్రీ విష్ణు గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన మా ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది.
డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ..ఈ వేడుకకు రాకేష్ కోసం వచ్చాను. నా కెరీర్లో చూసిన పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి. ఈ సినిమా విషయంలో ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తనలో సాటిస్ఫాక్షన్ చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. మూవీ యూనిట్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. డైరెక్టర్ పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 17న నేను థియేటర్‌కి వెళ్లి చూస్తాను.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా మాకు ఇచ్చిన ఈటీవీ విన్ వారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అచ్చ తెలుగు సినిమా ఇది. కచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది తెలుగులో నాకు నాలుగో సినిమా. ఈ కథ, ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చాయి. సినిమాపై నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డైరెక్టర్ ఈ కథను అద్భుతంగా రాశారు. తిరువీర్ గారితో నటించడం మంచి అనుభవం. నిర్మాతలకు, ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
ఈటీవీ విన్ కంటెంట్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. మన జీవితంలో జరిగిన చాలా సంఘటన సమాహారమే ఈ సినిమా. అది మెటాఫరీకల్ గా చెప్పడానికి అందరం లుంగీలు కట్టుకొని వచ్చాం. సినిమా చాలా బాగా వచ్చింది. రేపు రాత్రి నుంచి ప్రతి ధియేటర్ ఒక కళ్యాణమండపం కాబోతోంది. ప్రతాప్ గాడు బుజ్జమ్మని తీసుకురాబోతున్నాడు. మీరందరూ ఆ పెళ్లికి రావాలి. టికెట్ 99 రూపాయలు మాత్రమే. మీరందరూ సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. పరేషాన్ ప్రీవెడ్డింగ్ షో అందించిన తిరువీర్, అనగనగా లాంటి కంటెంట్ ని ఇచ్చిన ప్రొడ్యూసర్ రాకేష్, లిటిల్ హార్డ్స్ రాజు వెడ్స్ రాంబాయి లాంటి కంటెంట్ ని ఇచ్చిన ఈటీవీ విన్.. అందరు కలిసి చేస్తున్న ప్రామిస్ ఈ పాపం ప్రతాప్. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది
ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం శ్రీ విష్ణు గారికి కోన వెంకట్ గారికి నందిని రెడ్డి గారికి రోషన్ కి థాంక్యూ సో మచ్. చిన్న సినిమాకి టాలీవుడ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది ఏప్రిల్ 17న అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు . టికెట్ ధర 99 రూపాయలు మాత్రమే.
రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ.. తిరువీర్ ఆర్ట్ సినిమా హీరోలా అనిపిస్తాడు. తను చేసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్లయ్యాయి. ఇప్పుడు కమర్షియల్ హీరోగా చేశాడు. ఇది ఎంత బ్లాక్‌బస్టర్ అవుతుందో ఈ ప్రమోషన్ కంటెంట్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇప్పటివరకు చూసిన ప్రతి కంటెంట్‌ను ఎంజాయ్ చేశాను. కొత్త కంటెంట్‌ను వెతుక్కుని చేసే ఈటీవీ, కొత్త కంటెంట్ కనిపిస్తే అతుక్కునే తిరువీర్—ఇద్దరూ కలిసి చేసిన సినిమా ఇది. కచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ఏప్రిల్ 17న తప్పకుండా ఈ సినిమా అందరూ చూడండి.
ప్రొడ్యూసర్ రుద్రదేవ్ మాట్లాడుతూ.. ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. తిరువీర్ చాలా గొప్ప ఈజ్‌తో నటించారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇది మంచి వినోదాత్మక సినిమా. అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు గారికి, నందిని రెడ్డి గారికి, కోన వెంకట్ గారికి, రాజీవ్ కనకాల గారికి థాంక్యూ వెరీ మచ్. వారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ కడుపుబ్బ నవ్వుకుని వెళ్తారు. వంద రూపాయలకే రెండున్నర గంటల పాటు కడుపుబ్బ నవ్వుకునేలా ఉంటుంది. క్లైమాక్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఇందులో అద్భుతమైన నటీనటులు ఉన్నారు. సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. ఆడియన్స్ సినిమాకు రండి, కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో అనుమానం లేదు—ఇది నా గ్యారెంటీ.
అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ఇది నవ్వుతూ నటించే ప్రతి మగాడి కథ. చాలా మంచి సినిమా. చాలా రోజుల తర్వాత నేను తృప్తిగా చేసిన పాత్ర ఇది. ఈవివి, జంధ్యాల గారి సినిమాలను గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుంది. తిరువీర్ చాలా మంచి నటుడు. తనతో నటించడం ఎంతో ఆస్వాదించాను. ఇది ఈటీవీ విన్ సినిమా.. తప్పకుండా అందరూ ఆదరించాలి.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తిరువీర్ మా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చదివాడు. తను ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. చూస్తుంటే సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఫీలింగ్ కలిగింది. సినిమాలో మంచి నటీనటులు ఉన్నారు. ఈవెంట్‌కు వచ్చిన శ్రీ విష్ణు గారికి, నందిని రెడ్డి గారికి థాంక్యూ. ఏప్రిల్ 17న అందరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. షూటింగ్ సెట్లో ఎంత పాజిటివ్ వాతావరణం ఉంటే సినిమా అంత బాగా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా మంచి పాజిటివ్ వాతావరణంలో జరిగింది. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరేష్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి కంటెంట్‌తో తీసిన సినిమా ఇది. అందులో నాకు మంచి పాత్ర దొరికింది. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మూవీ యూనిట్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.
