
Mystical thriller web series Pochamma trailer Unveiled
Popular Telugu OTT platform aha is bringing a brand-new web series titled “Pochamma” to its subscribers. This mystical thriller stars Ambati Arjun, Sri Pooja Reddy, and Sneha in key roles. The series will begin streaming on aha from April 17th, with Gold subscribers getting access 24 hours earlier. It is produced by Shruti Naidu under the Shruti Naidu Chitra banner and directed by Ramesh Indra. The makers released the trailer today.
Going by the trailer, the story is set in a beautiful house located in a scenic area surrounded by forests. In front of the house, there is a small shrine dedicated to Goddess Pochamma, who is believed to protect the area and the home. The trailer builds suspense around what happens when the shrine and the idol are removed, raising the question of whether the goddess will tolerate such an act and how she punishes those responsible.
The trailer also introduces a young couple and their love story, along with the people who stand in the way of their relationship. It concludes on an intriguing note, showing the goddess returning to the place and the home she is devoted to. Overall, the trailer impresses with its blend of thrilling and divine elements.
ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” ట్రైలర్ రిలీజ్, ఈనెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న వెబ్ సిరీస్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ “పోచమ్మ” ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రల్లో నటించారు. “పోచమ్మ” వెబ్ సిరీస్ ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందవచ్చు. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు మేకర్స్ “పోచమ్మ” ట్రైలర్ రిలీజ్ చేశారు.
“పోచమ్మ” వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – చుట్టూ అడవులు ఉన్న ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఒక అందమైన ఇళ్లు ఉంటుంది. ఆ ఇంటి ముందే పోచమ్మ తల్లికి చిన్నగుడి కట్టి పూజిస్తుంటారు. ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని పోచమ్మ తల్లి కాపాడుతుంటుంది. అలాంటి తల్లి గుడిని,ఆమె విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకుంటుందా, ఆ తప్పులు చేసిన వారిని పోచమ్మ తల్లి ఎలా శిక్షించింది అనేది ట్రైలర్ లో ఆద్యంతం రోమాంచితంగా చూపించారు. ఒక యువ జంట ప్రేమ కథ, వారి ప్రేమకు అడ్డుపడే వ్యక్తులను ట్రైలర్ లో పరిచయం చేశారు. తను ఇష్టపడిన ఇంటికి, ఆ ప్రాంతానికి పోచమ్మ తల్లి తిరిగి రావడాన్ని చూపిస్తూ ట్రైలర్ ను ఆసక్తికరంగా ముగించారు.ఇలా థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్ తో “పోచమ్మ” సిరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
