
I Have No Connection with the Microfinance Case – Singer Mangli
Famous singer Mangli has clarified that she has no connection with the microfinance case. She stated that she has no greed for money and that music is her entire world. She also said that her brother has no involvement in the case. Mangli alleged that lawyer Subbu filed a case against her purely for publicity and to gain popularity.
Speaking to the media today about the microfinance case, Mangli became emotional during the press meet and broke down in tears.
Mangli said: “My name and my brother’s name are being circulated in the media in connection with the microfinance case. When I came to know about this, I was in Bengaluru for a program. I immediately clarified through social media that I have no connection with this case. Many people contact me for programs through my brother. Lawyer Subbu has filed this case against me for publicity, and to use that publicity to enter Bigg Boss. I will face him legally as well. I have no desire for money. During the recent elections in both Telugu states, several political parties offered me crores of rupees to campaign for them, but I refused. You can check my social media posts. In this microfinance fraud case, I will also stand in support of the victims.”
మైక్రో ఫైనాన్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు – గాయని మంగ్లీ
మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని గాయని మంగ్లీ తెలిపింది. తనకు డబ్బు ఆశ లేదని, పాటలే తన ప్రపంచమని మంగ్లీ చెప్పారు. ఈ కేసులో తన సోదురుడికి కూడా ఎలాంటి ఇన్వాల్వ్ మెంట్ లేదని ఆమె అన్నారు. న్యాయవాది సుబ్బు ప్రచారం కోసం, పాపులర్ అయ్యేందుకు తనపై కేసు పెట్టారని మంగ్లీ అన్నారు. మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంగ్లీ, ప్రెస్ మీట్ లో ఉద్వేగానికి లోనయై కన్నీళ్లు పెట్టుకున్నారు.
గాయని మంగ్లీ మాట్లాడుతూ – మైక్రో ఫైనాన్స్ కేసులో నా పేరు, నా సోదరుడు పేరును మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం నాకు తెలిసినప్పుడు బెంగళూరులో ఒక ప్రోగ్రాం లో ఉన్నాను. ఈ కేసుతో నాకు సంబంధం లేదని వెంటనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను. ప్రోగ్రామ్స్ కోసం నా సోదరుడి ద్వారా చాలా మంది నన్ను సంప్రదిస్తుంటారు. లాయర్ సుబ్బు పబ్లిసిటీ కోసం, ఆ పబ్లిసిటీ ద్వారా బిగ్ బాస్ కు వెళ్లాలనే నాపై కేసు పెట్టాడు. నేను కూడా న్యాయపరంగా అతన్ని ఎదుర్కుంటా. నాకు డబ్బు మీద ఆశ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో తమకు ప్రచారం చేయాలంటూ వివిధ పార్టీల వారు నాకు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. నేను ఒప్పుకోలేదు. నా సోషల్ మీడియా పోస్టులు కూడా చెక్ చేసుకోండి. ఈ మైక్రో ఫైనాన్స్ మోసంలో బాధితుల తరుపున కూడా నేను సపోర్ట్ గా నిలబడతాను. అన్నారు.
